పుష్ప 3 కూడా ఉందా..? అల్లు అర్జున్ ఏమన్నాడంటే..?

First Published | Feb 17, 2024, 8:27 AM IST

పుష్ప సినిమాతో చాలా సాధించాడు అల్లు అర్జున్. జాతీయ అవార్డ్ తో పాటు..గ్లొబల్ ఇమేజ్ వచ్చింది ఈసినిమాతో. ఇక పుష్ప2 తో అంతకు మించి సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక ఈరెండు కాకుండా.. పుష్ప3 కూడా ఉందా..? ఈ విషయంలో అల్లుఅర్జున్ ఏమంటున్నాడు...? 
 

పుష్ప సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించాడు అల్లుఅర్జున్.. దేశ వ్యాప్తంగానే కాకుండా.. రష్య, జపాన్, చైనా..తో పాటు.. ఆకరికి పాకిస్తాన్ లో కూడా... పుష్పరాజ్ రచ్చ చేశాడు. దాంతో పుష్ప సీక్వెల్ కోసం.. ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. పుష్ప2 ను అదరిపోయేట్టుగా ప్లాన్ చేశారు టీమ్. ఈసారి భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. 
 

పుష్ప 2ను వెయ్యికోట్ల కలెక్షన్ టార్గెట్ తో పాటు.. ఆస్కార్  కొట్టాలన పట్టదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం అల్లు అర్జున్ గెటప్ దగ్గర నుంచి.. కాన్సెప్ట్ వరకూ అంతా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు టీమ్. ఒక్క పోస్టర్ తో రచ్చ రచ్చ చేశారు. పుష్ప2 నుంచి రిలీజ్ అయిన బన్నీ పోస్టర్ కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మూవీపై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అయ్యింది. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే తాజాగా పుష్పకు సబంధించిన మరో విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. పుష్ప3 మూవీ. అవును... పుష్ప2 తో పాటు.. పార్ట్ 3 కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.  తాజాగా బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ ఈ ఫ్రాంచేజ్ మూవీగురించి క్లారిటీ ఇచ్చాడు. బెర్లిన్ లో పుష్ప ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు... ఈ అరుదైన అవకాశం రావడంతో జర్మన్ వెళ్ళారు ఐకాన్ స్టార్. 
 

ఇక అక్కడ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. పుష్ప 1 మూవీని ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తుండడంతో దానిని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు అన్నారు.అలానే పుష్ప 3 గురించి మాట్లాడుతూ, ఆ మూవీ కచ్చితంగా ఉండొచ్చని అన్నారు. దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అన్నారు. 
 

ఇక పుష్ప ని ఫ్రాంచైజ్ లుగా మార్చాలని అంటుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. దీనితో పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప2 కి వ్చిన రెస్పాన్స్ ను బట్టి.. పుష్ప3 తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ దృష్టి అంతా పుష్ప2 పైనే పెట్టారు. 

Latest Videos

click me!