Xiaomi 17 Pro Max: ఐఫోన్‌ను షేక్ చేస్తున్న చైనా ఫోన్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫోన్‌లో లేని కొత్త ఫీచ‌ర్

Published : Jul 11, 2026, 10:40 AM IST

Xiaomi 17 Pro Max: ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఏది అంటే వెంట‌నే ఐఫోన్ 17ప్రో అని చెప్తాము. అయితే చైనాలో ఐఫోన్ కంటే షావోమికి చెందిన 17 ప్రో మ్యాక్స్ అమ్మ‌కాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఇంతకీ ఫోన్ ప్రత్యేకతలు ఏంటంటే.?  

PREV
15
ప్రీమియం డిజైన్‌తో భారీ డిస్‌ప్లే

షావోమీ నుంచి త్వరలో రానున్న Xiaomi 17 Pro Max స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ భారత్‌లో ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. అయితే ఇప్ప‌టికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీటి ప్ర‌కారం షావోమీ 17 ప్రో మ్యాక్స్ ప్రీమియం లుక్‌తో తీసుకొచ్చారు. ముందు భాగంలో Dragon Crystal Glass 3 రక్షణ, అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చార‌ని సమాచారం. ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు ఉండే అవకాశం ఉంది. 

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, Dolby Vision సపోర్ట్ ఉండొచ్చు, గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించనుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఫోన్ వెనుక భాగంలో 2.9 అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లే కూడా ఇచ్చారు. దీని ద్వారా నోటిఫికేషన్లు చూడడం, వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడం సులభం అవుతుంది. ఈ ఫీచ‌ర్ ఉన్న తొలి ఫోన్ ఇదే అని అంటున్నారు.

25
సూపర్ పనితీరు

Xiaomi 17 Pro Maxలో తాజా క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఇచ్చారు. దీనికి Adreno 840 GPU జతకానుంది. దీంతో గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులు చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్ 12GB, 16GB RAM వేరియంట్లలో, అలాగే 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి రావొచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుందని అంచనా.

35
50MP ట్రిపుల్ కెమెరాతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ

కెమెరా విభాగంలో కూడా Xiaomi 17 Pro Max ప్ర‌త్యేకంగా నిల‌బెట్టారు. ఈ ఫోన్‌లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చార‌ని. ఇందులో ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. దీంతో దూరంలోని వస్తువులను కూడా స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు. అలాగే హై క్వాలిటీ వీడియోలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఈ కెమెరా సెటప్ ఉపయోగపడనుంది.

45
7,500mAh భారీ బ్యాటరీ.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో 7,500mAh భారీ బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

55
భార‌త్‌లో ఎంత ధ‌ర ఉండ‌నుంది.?

షావోమి 17 ప్రో మ్యాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైప‌ర్ ఓఎస్ 3తో అందుబాటులోకి తెచ్చారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్ 5G సిమ్, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్, USB Type-C 3.2, మల్టీ శాటిలైట్ GPS వంటి ఫీచర్లు ఉండొచ్చు. అదనంగా IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. దీంతో నీరు, దుమ్ము నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది. ధ‌ర విష‌యానికొస్తే భార‌త మార్కెట్లో ఈ ఫోన్ ధ‌ర రూ.80,000 నుంచి రూ.1,00,000 మధ్యలో ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే అధికారిక ధర, విడుదల తేదీని షావోమీ ఇంకా ప్రకటించలేదు. విడుదల సమయంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories