Rechargeable Lint Remover: స్వెటర్లు, శాలువాలు, టీ షర్టుల వంటి బట్టలపై చిన్న చిన్న నూలు పోగులు (Lint/Pilling) ఏర్పడటం సహజం. వీటిని చేత్తో తొలగించడం కాస్త కష్టమని చెప్పాలి. అయితే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడక్ట్‌తో ఇట్టే చెక్ పెట్టొచ్చు.
అమెజాన్‌లో NUUK RIZZ Rechargeable Lint Remover పేరుతో కేవలం రూ. 999కి అందుబాటులో ఉందీ ప్రొడక్ట్. ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ షేవర్ బట్టలను దెబ్బతీయకుండా శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ లింట్ రిమూవర్‌లో డ్యూయల్ స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. దీంతో పలుచని శాలువాలు, స్వటర్లు, కోట్లు, టీ-షర్టులు, దుప్పట్లు వంటి వివిధ రకాల బట్టలపై అవసరానికి అనుగుణంగా స్పీడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బట్టలపై ఉన్న లింట్, ఫజ్, చిన్న నూలు గుళికలను సులభంగా తొలగిస్తుంది.
25
హనీకాంబ్ మెష్, 3 బ్లేడ్ టెక్నాలజీ
ఈ పరికరంలో మూడు పరిమాణాల రంధ్రాలతో కూడిన హనీకాంబ్ మెష్, మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లు ఉన్నాయి. ఇవి బట్టలకు నష్టం కలగకుండా లింట్‌ను సమర్థవంతంగా తొలగిస్తాయి. దీంతో బట్టలు కొత్తవాటిలా శుభ్రంగా కనిపిస్తాయి.
35
రీఛార్జబుల్ బ్యాటరీ.. టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్
ఈ పరికరంలో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 60 నిమిషాల వరకు పనిచేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. ఆధునిక యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అవసరమైతే ఛార్జింగ్‌లో ఉన్నప్పుడే కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫ్యాబ్రిక్ షేవర్ 70 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దంతో పనిచేస్తుంది. కాబట్టి ఉపయోగించే సమయంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు. చిన్న పరిమాణంలో ఉండటంతో బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. కంపెనీ దీనితో పాటు ఉచిత ట్రావెల్ స్టోరేజ్ పౌచ్ కూడా అందిస్తోంది. దీంతో ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉపయోగించవచ్చు.
55
బలమైన నిర్మాణం.. ముఖ్యమైన ఫీచర్లు
ఈ లింట్ రిమూవర్‌ను ఏబీఎస్ (ABS) ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ పదార్థాలతో తయారు చేశారు. ఇందులో 5 వాట్ల మోటార్, సురక్షిత డిజైన్, ఎర్గోనామిక్ హ్యాండిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. చిన్న సైజులో ఉండటం వల్ల ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. బట్టలను శుభ్రంగా, కొత్తలా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన గార్మెంట్ కేర్ పరికరంగా చెప్పవచ్చు.