ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడైన ఫోల్డబుల్ ఫోన్ల ప్రాభవం ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటోంది. అందుకు అనుగుణంగానే 2025లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ కొత్త శిఖరాలకు చేరుకోనుంది. Samsung, Oppo, Xiaomi, Google, Motorola వంటి దిగ్గజ కంపెనీలు తమ నెక్స్ట్ జనరేషన్ ఫోన్లను విడుదల చేయనున్నాయి. వాటిపై ఓసారి లుక్కేద్దామా...
ఫోల్డబుల్ ఫోన్లలో Samsung ముందంజలో ఉంది. Galaxy Z Fold 7, Z Flip 7 ఫోన్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Galaxy Z Fold 7లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 8 ఇంచ్ డిస్‌ప్లే, 6.5 ఇంచ్ కవర్ డిస్‌ప్లే ఉంటాయి. S Pen సపోర్ట్ లేకపోయినా, చాలా సన్నగా 4.9 మి.మీ. మందంతో ఉంటుంది.
25
Oppo Find N5 ఫోల్డబుల్ ఫోన్
Oppo Find N5 చాలా సన్నని ఫోల్డబుల్ ఫోన్. 3.7 మి.మీ. మందంతో, టైటానియం బాడీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 50MP కెమెరా, 5,700mAh బ్యాటరీ, IPX9 వాటర్ రెసిస్టెన్స్, స్టైలస్ పెన్ సపోర్ట్ ఉంటాయి. OnePlus Open 2కి గట్టి పోటీ ఇస్తుంది.
Motorola Razr 60 Ultra, Razr 50 Ultra కంటే మెరుగైన ఫోన్. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ ఎలైట్ చిప్‌సెట్, 6.9 ఇంచ్ డిస్‌ప్లే, 4 ఇంచ్ కవర్ స్క్రీన్, 50MP కెమెరా ఉంటాయి. BIS సర్టిఫికెట్ వచ్చింది, 2025లో విడుదల కానుంది.
55
Google Pixel 10 Pro Fold ఫోన్
Google Pixel 10 Pro Fold సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది. టెన్సర్ జి5 చిప్‌సెట్, 16 GB RAM, 256/512 GB మెమరీ, 48MP కెమెరా ఉంటాయి.