టీసీఎల్ 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1,24,990కాగా అమెజాన్‌లో 64 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,990కి లభిస్తోంది. దీనికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీ 65 ఇంచుల పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. 4K రిజల్యూషన్ (3840 × 2160), HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో HVA ప్యానెల్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీని ఇచ్చారు. ఇవన్నీ కలిపి క్లియర్, కలర్ ఫుల్ పిక్చర్ ఇస్తాయి. సినిమాలు, స్పోర్ట్స్ చూసేటప్పుడు మంచి అనుభూతి పొందొచ్చు.