Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే

Published : Dec 14, 2025, 01:04 PM IST

Smart phone: స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవితం ఊహించలేం. కాల్స్, సోషల్ మీడియా, గేమ్స్, ఆన్‌లైన్ చెల్లింపులు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య ఫోన్ ఎక్కువగా వేడెక్కడం. ఇంత‌కీ ఫోన్ ఎందుకు వేడెక్కుతుందంటే. 

PREV
15
ఎక్కువ వినియోగం వల్ల ప్రాసెసర్‌పై ఒత్తిడి

ఫోన్‌లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, వీడియో ఎడిటింగ్ చేయడం, 4K వీడియోలు రికార్డ్ చేయడం లాంటివి చేస్తే ప్రాసెసర్ ఎక్కువగా పని చేస్తుంది. CPU, GPU ఫుల్ స్పీడ్‌లో నడిచినప్పుడు సహజంగానే వేడి ఉత్పత్తి అవుతుంది. కూలింగ్ సిస్టమ్ బలహీనంగా ఉన్న ఫోన్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో ఫోన్‌కు కొంత విశ్రాంతి ఇవ్వడం అవసరం.

25
చార్జింగ్ సమయంలో ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది?

ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు బ్యాటరీలో రసాయన చర్యలు జరుగుతాయి. దీనివల్ల వేడి పుడుతుంది. చార్జింగ్ సమయంలోనే ఫోన్ వాడితే ఈ వేడి ఇంకా పెరుగుతుంది. నాణ్యత లేని చార్జర్లు లేదా ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ కూడా బ్యాటరీపై ఒత్తిడి పెంచి ఫోన్ వేడెక్కేలా చేస్తాయి.

35
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, సాఫ్ట్‌వేర్ లోపాలు

ఫోన్‌లో అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటే RAM, ప్రాసెసర్‌పై లోడ్ పెరుగుతుంది. అలాగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడం, యాప్స్‌లో బగ్స్ ఉండటం వల్ల కూడా ఫోన్ వేడెక్కుతుంది. కొన్ని మాల్వేర్ యాప్స్ నిశ్శబ్దంగా సిస్టమ్‌ను వినియోగించి ఫోన్‌ను వేడిగా మారుస్తాయి.

45
వాతావరణం, యూజ‌ర్ల తప్పు అలవాట్లు

ఎండలో లేదా ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో ఫోన్ వాడటం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టడం, ఎక్కువ మందం ఉన్న ఫోన్ క‌వ‌ర్లు వాడటం, గాలి వెళ్లే అవకాశం లేకుండా ఉంచడం కూడా వేడిని పెంచుతుంది. అలాగే ఎక్కువసేపు చార్జింగ్‌లో పెట్టి ఉంచడం కూడా ప్రమాదకరం.

55
ఇలా చేస్తే ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది

అవసరం లేని యాప్స్ క్లోజ్ చేయండి. చార్జింగ్ చేస్తున్న‌ సమయంలో ఫోన్ వాడకండి. నాణ్యమైన చార్జర్ మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌కు అప్పుడప్పుడూ రీస్టార్ట్ చేయండి. ఎండలో ఫోన్ ఎక్కువసేపు వాడకండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ ఓవర్‌హీటింగ్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫోన్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది, బ్యాటరీ ఆయుష్షు కూడా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories