Smart TV: ప్రస్తుతం పెద్ద స్క్రీన్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టీవీల్లోనే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ లభిస్తోంది.
వీడబ్ల్యూ 55 ఇంచెస్ ప్రో సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీని ప్రీమియం స్మార్ట్ టీవీగా తీసుకొచ్చారు. ఈ టీవీలో 55 ఇంచుల భారీ డిస్‌ప్లే, 4K క్వాలిటీ, 120Hz రిఫ్రెష్ రేట్, గూగుల్ టీవీ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ టీవీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్‌కు మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో 55 ఇంచుల పెద్ద స్క్రీన్ అందించారు. 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 × 2160) ఉండటం వల్ల వీడియోలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. QLED టెక్నాలజీ కారణంగా రంగులు మరింత సహజంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. HDR10+, HLG, వైడ్ కలర్ గాంట్ సపోర్ట్ ఉండటం వల్ల డార్క్ సీన్స్‌లో కూడా మంచి క్లారిటీ లభిస్తుంది. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్‌తో సినిమాలు నిజ జీవితంలా కనిపించే అనుభూతి కలుగుతుంది.
25
120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్
ఈ టీవీలో 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. అందువల్ల ఫాస్ట్ మూవింగ్ సీన్స్, స్పోర్ట్స్, యాక్షన్ మూవీస్, గేమింగ్ సమయంలో స్క్రీన్ ల్యాగ్ లేదా బ్లర్ తక్కువగా ఉంటుంది. MEMC టెక్నాలజీ కూడా ఉండటం వల్ల వీడియోలు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసి ఆడేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. ధర విషయానికొస్తే ఈ టీవీ అసలు ధర రూ. 64,999 కాగా అమెజాన్‌లో 58 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి లభిస్తోంది. దీనికి అదనంగా అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పే చేస్తే రూ. 800 వరకు ఆదా చేసుకోవచ్చు.
35
గూగుల్ టీవీ, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్
ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోని లివ్, జీ5 వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఇన్‌స్టాల్ చేశారు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్న రిమోట్‌తో మాట్లాడి టీవీని కంట్రోల్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా సినిమాలు సెర్చ్ చేయడం, యాప్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కిడ్స్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, వాచ్ లిస్ట్ వంటి ఫీచర్లు కూడా అందించారు.
ఈ టీవీలో 50W పవర్‌ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ వల్ల థియేటర్ లాంటి సౌండ్ అనుభూతి లభిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఇథర్‌నెట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ కన్సోల్, సెటాప్ బాక్స్, హార్డ్ డ్రైవ్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేయవచ్చు.
55
టీవీ బాక్సులో ఏముంటాయి.?
ఈ టీవీతో పాటు కంపెనీ కొన్ని అవసరమైన యాక్సెసరీస్ కూడా ఇస్తోంది. వాటిలో 1 టీవీ యూనిట్, 1 స్మార్ట్ రిమోట్, పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, 2 స్టాండ్లు, స్టాండ్ స్క్రూలు ఉంటాయి. బెజెల్-లెస్ డిజైన్‌తో ఈ టీవీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. పెద్ద స్క్రీన్, గూగుల్ టీవీ ఫీచర్లు, మంచి సౌండ్, 4K QLED డిస్‌ప్లేతో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.