Samsung Galaxy S25 Ultra : అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర భారీగా తగ్గింది. రూ. 34,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఇప్పుడు అతి తక్కువ ధరకే ఈ ప్రీమియం ఫోన్ లభిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
శామ్‌సంగ్ లవర్స్‌కు పండగే.. S26 అల్ట్రా రాకముందే భారీగా తగ్గిన S25 అల్ట్రా ధర
శామ్‌సంగ్ అభిమానులకు ఇది నిజంగా అదిరిపోయే న్యూస్. మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధర అని చెప్పవచ్చు.
26
Samsung Galaxy S25 Ultra భారీగా తగ్గింపు
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారత్‌లో రూ. 1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం అమెజాన్ డీల్‌లో భాగంగా ఈ ఫోన్ పై ఏకంగా రూ. 34,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 95,999 కే అందుబాటులోకి వచ్చింది.
ఈ ఆఫర్ ప్రధానంగా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్, టైటానియం గ్రే కలర్ మోడల్‌పై లభిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి అదనపు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు లేకపోయినా, ఈ డైరెక్ట్ డిస్కౌంట్ మాత్రం చాలా సూపర్ అని చెప్పాలి.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో క్వాల్కమ్ కింగ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను వాడారు. ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్. మీరు హెవీ గేమ్స్ ఆడినా లేదా మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. లాగ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి, గేమింగ్ ప్రియులకు ఇది ఒక సూపర్ ఫోన్.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అదిరిపోయే డిస్‌ప్లే, డిజైన్
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మునుపటి మోడల్స్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇందులో 6.9 ఇంచుల భారీ స్క్రీన్ ఉంది. స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్ చాలా సన్నగా ఉండటం వల్ల డిస్‌ప్లే చాలా పెద్దదిగా, రిచ్‌గా కనిపిస్తుంది. వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఈ లార్జ్ డిస్‌ప్లే అదిరిపోయే అనుభూతిని ఇస్తుంది. డిజైన్ పరంగా కూడా ఇది చాలా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.
56
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: సూపర్ కెమెరా క్వాలిటీ
శామ్‌సంగ్ అల్ట్రా సిరీస్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.
• 200 MP మెయిన్ ప్రైమరీ సెన్సార్.
• 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్.
• 50 MP టెలిఫోటో లెన్స్ (5x ఆప్టికల్ జూమ్).
• 10 MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్).
ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి, ప్రొఫెషనల్ ఫోటోలు తీసుకోవాలనుకునే వారికి ఈ కెమెరా సెటప్ బెస్ట్ ఆప్షన్. లో లైట్‌లో కూడా పిక్చర్స్ చాలా క్లారిటీగా వస్తాయి.
66
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: బ్యాటరీ, ఇతర ఫీచర్లు
రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ అయిపోకూడదు అనుకునే వారి కోసం ఇందులో 5,000mAh బ్యాటరీని అందించారు. ఇది ఈజీగా ఒక రోజంతా బ్యాకప్ ఇస్తుంది. ఇక వచ్చే నెలలో S26 అల్ట్రా లాంచ్ అయ్యే అవకాశముంది. అందుకే ఇప్పుడు శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింది. అయితే, ఈ ధరకు S25 అల్ట్రాను దక్కించుకోవడం మంచి డీల్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా తక్కువ ధరకు వచ్చే ఛాన్స్ ఉన్నా, ప్రస్తుతం ఉన్న రూ. 34,000 తగ్గింపు మాత్రం మిస్ చేసుకోకూడని ఆఫర్ అని చెప్పవచ్చు.