స్మార్ట్‌ఫోన్‌కి కూడా గొడుగులు ఉన్నాయండోయ్‌.. ఇకపై వ‌ర్షం, ఎండ‌ మీ ఫోన్‌ను ఏం చేయ‌లేవు

Published : Jul 11, 2026, 04:51 PM IST

Phone Umbrella: ఎండలో బయట ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్ స్పష్టంగా కనిపించకపోవడం, ఫోన్ వేడెక్కిపోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అలాగే వ‌ర్షంలో కూడా ఫోన్ బ‌య‌ట‌కు తీయాలంటే భ‌యంగా ఉంటుంది. అయ‌తే ZORBES Phone Umbrella ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది. 

PREV
15
ఫోన్‌కు గొడుగులా రక్షణ

ఈ ఫోన్ అంబ్రెలా ప్రధానంగా ఎండ, వాన‌ నుంచి ఫోన్‌ను రక్షించేందుకు రూపొందించారు. ఫోన్ స్క్రీన్‌పై నేరుగా సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటుంది. దీంతో స్క్రీన్ స్పష్టంగా కనిపించడమే కాకుండా, ఫోన్ వేడెక్కే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే వ‌ర్షం నీరు కూడా ప‌డ‌దు. ఎక్కువసేపు బయట ఫోన్ ఉపయోగించే వారికి ఇది మంచి యాక్సెసరీగా ఉంటుంది.

25
బలమైన మాగ్నెటిక్ హోల్డర్

ఈ అంబ్రెలాలో బలమైన మాగ్నెట్ రింగ్ ఉంటుంది. దీంతో మాగ్నెటిక్ సపోర్ట్ ఉన్న ఫోన్లకు లేదా మాగ్నెట్ కేస్ ఉన్న ఫోన్లకు సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన మాగ్నెట్ కారణంగా ఫోన్ సులభంగా జారిపడకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. బయట గాలి ఉన్నా కూడా స్థిరంగా ఉంటుంది. ధర విషయానికొస్తే అమెజాన్ లో ఈ ప్రొడక్ట్ రూ. 999కి లభిస్తోంది.

35
అవసరానికి తగ్గట్టు మార్చుకునే సౌకర్యం

ఈ ఫోన్ అంబ్రెలాలో మెటల్‌తో తయారైన ఫ్లెక్సిబుల్ హ్యాండిల్ ఉంటుంది. దీనిని అవసరానికి అనుగుణంగా పైకి, కిందకు లేదా పక్కకు తిప్పి సెట్ చేసుకోవచ్చు. ఫోన్ స్క్రీన్‌కు అడ్డంకి కలగకుండా నీడ పడేలా సర్దుకోవచ్చు. వీడియోలు చూడడం, ఫోటోలు తీయడం లేదా వీడియో రికార్డింగ్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుంది.

45
360 డిగ్రీ రింగ్‌తో మెరుగైన గ్రిప్

ఈ యాక్సెసరీలో 360 డిగ్రీలు తిరిగే ఫోన్ రింగ్ కూడా ఉంటుంది. దీని వల్ల ఫోన్‌ను చేతిలో మరింత గట్టిగా పట్టుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను వివిధ కోణాల్లో ఉంచి ఉపయోగించవచ్చు. ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్, వీడియోలు చూడడం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది.

55
ప్రయాణాలకు అనువైన డిజైన్

ఈ ఫోన్ అంబ్రెలా బరువు కేవలం 100 గ్రాములు మాత్రమే. ఉపయోగం పూర్తయిన తర్వాత మడిచి బ్యాగ్‌లో సులభంగా పెట్టుకోవచ్చు. బీచ్, పూల్, పిక్నిక్, పార్క్ లేదా అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లే వారు దీనిని వెంట తీసుకెళ్లవచ్చు. చిన్న పరిమాణంలో ఉండటంతో ఎక్కువ స్థలం కూడా ఆక్రమించదు.

Read more Photos on
click me!

Recommended Stories