OPPO Find X8 Pro
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏ డివైస్‌నైనా సంవత్సరపు ఉత్తమ ఫ్లాగ్‌షిప్ అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు వినియోగదారులు పర్సనలైజ్డ్, అసాధారణ డిజైన్,కెమెరా, AI ఫీచర్లలో కొత్త స్థాయిలను కోరుకుంటున్నారు. అత్యాధునిక
సాంకేతికతను ధైర్యవంతమైన డిజైన్‌తో కలిపిన ఫోన్ మాత్రమే ఈ స్థాయిని పొందగలదు. నాకు మాత్రం OPPO Find X8 Pro అత్యుత్తమ స్థాయిని పొందగలదని అనిపిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌లో ప్రత్యేక మైన అంశాలను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
OPPO Find X8 Pro
సూపర్-స్లిమ్ డిజైన్
OPPO Find X8 Pro లో నన్ను వెంటనే ఆకట్టుకున్నది దాని స్టైలిష్ డిజైన్. 8.24మిమీ మందం, 215 గ్రాముల బరువుతో ఇది చాలా స్లిమ్‌గా, చేతిలో చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. నాలుగు వైపులా కర్వ్ చేసిన గ్లాస్ అల్యూమినియం ఫ్రేమ్‌లో
సజావుగా ఇమిడి స్లీక్, ఆర్గనామిక్ ప్రొఫైల్‌ని సృష్టిస్తుంది. నాకు ఇది ప్రత్యేకంగా ఇష్టమైనది. OPPO Cosmos Ring క్వాడ్-కెమెరా సెటప్ చుట్టూ ఉంది. మధ్యలో హాసెల్‌బ్లాడ్ "H" లోగో ఉంది. ఈ కెమెరా యూనిట్ కేవలం 3.58 మిమీ మందం మాత్రమే ఉండి, మునుపటి డివైస్ సీరీస్ తో పోల్చితే 40% తక్కువ బరువు కలిగి ఉంది, ఇది గేమింగ్ వీడియో సెషన్ల సమయంలో హ్యాండిల్ చేయడాన్ని ఈజీ చేస్తుంది.
అలర్ట్ స్లైడర్ సులభంగా పనిచేస్తుంది, ఇది రింగ్, వైబ్రేట్, సైలెంట్ మోడ్‌ల మధ్య మార్పును సులభంగా చేస్తుంది. జేబులో ఉన్నప్పటికీ. ఫోన్ స్థిరత్వం కూడా ఆశ్చర్యకరంగా ఉంది, ఆర్మర్ షీల్డ్ నిర్మాణం కారణంగా ఇది బలంగా గ్లాస్, మన్నికైన అల్యూమినియం అలాయ్‌ను కలపడం ద్వారా IP68, IP69 రేటింగ్‌లు ఉన్న ఈ ఫోన్ నీటిలో మునిగినప్పుడు, అధిక ఒత్తిడి కలిగినపుడు మంచి రక్షణ కలిగి ఉంటుంది. నాకు దీన్ని ఎక్కడైనా వాడొచ్చనే నమ్మకం కలుగుతోంది.
OPPO Find X8 Pro
అద్భుతమైన డిస్‌ప్లే
ఇన్ఫినిట్ వ్యూ 120Hz ProXDR డిస్‌ప్లే మరో విశేషం. నాలుగు వైపులా స్వల్పంగా కర్వ్ చేసిన గ్లాస్, 1.9 మిమీ బెజెల్‌తో ఫ్రేమ్ చేయబడింది, ఇది యాదృచ్ఛికంగా టచ్‌లను తగ్గిస్తుంది, కంటెంట్‌ను మరింత శోభింపజేస్తుంది. 6.78 అంగుళాల డిస్‌ప్లే 2160Hz PWM డిమ్మింగ్ తో 70 నిట్స్ కింద పని చేస్తుంది, ఇది రాత్రిపూట కంటి అలసటను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. TV రీన్లాండ్ ఐ కమ్ఫర్ట్ 4.0 సర్టిఫికేషన్, స్ప్లాష్ టచ్ ఫంక్షనాలిటీ స్క్రీన్ తడిచినప్పుడు కూడా పని చేస్తుంది, వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. Dolby Vision, HDR10, HDR10+, HLG మద్దతుతో ఉన్న ఈ డిస్‌ప్లే, HD కంటెంట్‌ను చూస్తున్నప్పుడు నిజంగా ఒక శోభాకరమైన అనుభూతిని ఇస్తుంది.
OPPO Find X8 Pro
సీమ్ లెస్ పెర్ఫార్మెన్స్
MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ద్వారా శక్తివంతమైన Find X8 Pro అద్భుతమైన పనితీరు అందిస్తుంది. ఈ ప్రాసెసర్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇదే కావడం గమనించదగిన విషయం. గేమింగ్, వీడియో సెషన్లలో, ఫోన్ లాగ్ లేకుండా, వేడి ఎక్కకుండా, సజావుగా పనిచేసింది. ఇది దాని ఆధునిక కూలింగ్ సిస్టమ్ కారణంగా చల్లగా ఉంటుంది. అంతేకాక, AI LinkBoost కూడా అద్భుతంగా పనిచేసింది, ఇది మా పరీక్షలలో, ఎలివేటర్ లో లేదా ప్యాక్డ్ హాల్‌లలో వంటి తక్కువ నెట్‌వర్క్ ప్రాంతాలలో అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను పెంచింది.
OPPO Find X8 Pro
దీర్ఘకాలిక బ్యాటరీ
బ్యాటరీ పనితీరు ఈ ఫోన్ మరొక ముఖ్యమైన లక్షణం. 5910mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ తో, ఇది 23 గంటల YouTube స్ట్రీమింగ్ లేదా 24 గంటల Netflix వీక్షణను సులభంగా సమర్ధిస్తుంది. 80W SUPERVOOCTM ఛార్జింగ్ , కేవలం 55 నిమిషాల్లో గంటల కొద్దీ వినియోగాన్ని అందిస్తుంది. అదనంగా, 50W AIRVOOCTM వైర్‌లెస్ ఛార్జింగ్ , 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, యాక్సెసరీస్ కోసం చాలా అనువుగా పనిచేస్తాయి, నాకు నచ్చిన ప్రత్యేక లక్షణం ఇది.
OPPO Find X8 Pro
ప్రతి క్షణానికి తగిన కెమెరా
నా దృష్టిలో కెమెరా ఈ ఫోన్‌లో అతి పెద్ద విశేషం. క్వాడ్-కెమెరా సెటప్ లో నాలుగు 50MP లెన్స్‌లు ఉన్నాయి, అందులో డ్యుయల్-పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ప్రపంచంలో మొదటిసారిగా అందించబడ్డాయి. 73mm (3x జూమ్), 135mm (6x జూమ్) లెన్స్‌లు 15mm నుండి 300mm పైగాఫోకల్ రేంజ్‌లో అద్భుతమైన స్పష్టతను అందిస్తాయి. HyperTone ఇమేజ్ ఇంజన్ ద్వారా ఫోన్ 9 RAW ఫ్రేమ్‌లను మిళితం చేసి, డైనమిక్ రేంజ్, తక్కువ శబ్దంతో అద్భుతమైన ఫోటోలను
అందిస్తుంది.
నాకు ప్రత్యేకంగా నచ్చిన ఫీచర్ స్టేజ్ మోడ్. ఇది 20x లేదా 30x జూమ్ ద్వారా సంగీత కచేరీలు వంటి దూర సంఘటనలను చిత్రీకరించేందుకు అనుమతించింది. లైట్నింగ్ స్నాప్ కూడా అద్భుతం—దీని ద్వారా కేవలం 7
ఫ్రేమ్స్/సెకన్ వేగంతో వేగంగా కదిలే వస్తువులను DSLR లాగా స్పష్టంగా చిత్రీకరించగలిగాను. హాసెల్‌బ్లాడ్ పోర్ట్రయిట్ మోడ్ ఆరు ఫోకల్ లెన్త్‌లను అందిస్తుంది, అందులో ప్రపంచంలో ఏకైక 135mm ఆప్టికల్ పోర్ట్రయిట్ మోడ్ కూడా ఉంది, ఇది జుట్టు వంటి మైక్రో డిటైల్స్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది.
OPPO Find X8 Pro
స్మార్టర్ AI ఫీచర్లు
Find X8 Pro ఫోటోలు ప్రొడక్టివిటీని పెంచే AI టూల్స్‌తో వస్తుంది. ఆధునిక ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌లలో AI క్లారిటీ ఎన్‌హాన్సర్ ఉంది, ఇది తక్కువ రిజల్యూషన్ మరియు క్రాప్ చేసిన చిత్రాలను అధిక-నాణ్యత దృశ్యాలుగా మార్చుతుంది. AI అన్‌బ్లర్ సహజమైన వివరాలు, రంగులు పునరుద్ధరించడంలో సహాయపడుతుంది, అలాగే AI రిఫ్లెక్షన్ రిమూవర్
గ్లాస్ నుండి మెరుపులను తొలగిస్తుంది. నాకు చాలా నచ్చిన ఫీచర్ ఇది. AI స్టూడియో రియిమేజ్ టూల్ ఇది ఒక ముఖ ఫోటోకు అనేక మార్పులను సృష్టించగలదు, అవతార్‌లు లేదా సోషల్ పోస్ట్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పరికరం AI సమ్మరీ, AI స్పీక్, AI రైటర్, AI రికార్డర్ వంటి ఉత్పాదకత టూల్స్‌ను కూడా కలిగి ఉంది, ఇవి Gemini 1.5 Pro తో శక్తివంతంగా పనిచేస్తాయి.
ColorOS 15
ఒప్పో ఫైండ్ X8 సిరీస్, Android 15 ఆధారంగా రూపొందించిన ColorOS 15 తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్. ఇది అత్యంత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. స్పర్శకు వేగవంతమైన ప్రతిస్పందనలు ఉండటం గమనించాను. అన్‌లాక్ చేయడం , ఛార్జింగ్ వంటి రోజువారీ చర్యల కోసం కొత్తగా 800 కంటే ఎక్కువ అనిమేషన్‌లు చేర్చారు, ఇవి
చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. మినిమలిస్టిక్ డిజైన్సహజమైన బ్లర్‌లతో యూజర్ అనుభవానికి అందాన్ని చేకూరుస్తుంది.
OPPO Find X8 Pro
ప్రతిభావంతమైన ప్రత్యామ్నాయం
ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్‌తో పాటుగా విడుదలైన ఒప్పో ఫైండ్ X8గురించి కూడా ప్రస్తావించుకోవడం అవసరం. ఇది రెండవ ఎంపిక కాదు—దాని ప్రత్యేకతను తానే నిరూపిస్తుంది. కాస్మోస్ రింగ్, కాంపాక్ట్ డిజైన్, ఒప్పో ఫోన్‌లో అత్యంత సన్నని బెజెల్ (1.45mm) కలిగి, ఇది బ్రాండ్ ప్రీమియమ్ టచ్‌ను కొనసాగిస్తుంది. హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరా సిస్టమ్ తో మూడు 50MP అధిక పనితీరు కెమెరాలు , AI టూల్స్ ఉన్నాయి. ఈ పరికరం 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పాటు
80W SUPERVOOCTM ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ తో శక్తివంతమైన, స్టైలిష్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
OPPO Find X8 Pro
మా అభిప్రాయం
ఒప్పో ఫైండ్ X8 ప్రో అద్భుతమైన ఎంపిక. 8.24mm సన్నని మన్నికైన గ్లాస్, అల్యూమినియం అల్లాయ్ నిర్మాణంతో కూడిన హాసెల్‌బ్లాడ్ క్వాడ్ కెమెరా, సొంత డిజైన్ అంశాలతో ఈ పరికరం ప్రత్యేకంగా నిలుస్తుంది. 55 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అయ్యే 5910mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, ల్యాగ్ లేకుండా గేమింగ్, వీడియో సెషన్‌లకు సరిపోయే ప్రాసెసర్, అలాగే
అద్భుతమైన AI ఫీచర్లతో మెరుగైన కెమెరా ఇలా—ఈ ఫోన్ అన్ని వైపులా ఆకట్టుకుంటుంది. ఈ ధర వద్ద, ఇది అసాధారణంగా నిలుస్తూ, భారతదేశంలోని ఉత్తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా తన హోదాను సమర్థించుకుంటుంది.
OPPO Find X8 Pro
ధర , లభ్యత
ఒప్పో ఫైండ్ X8 సిరీస్ భారతదేశంలో అధికారికంగా విడుదలైంది. ఒప్పోఫైండ్ X8 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది:
- 12GB + 256GB ధర: ₹69,999
- 16GB + 512GB ధర: ₹79,999
ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర ₹99,999 (16GB + 512GB). డిసెంబర్ 3, 2024 నుండి ఈ పరికరాన్ని ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, మెయిన్‌లైన్ రిటైలర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోండి!