OPPO Find X10 Pro Max: ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ 200MP కెమెరా ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?

Published : Oct 22, 2026, 11:43 AM IST

OPPO Find X10 Pro Max: ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ను ట్రిపుల్ 200MP కెమెరా సెటప్ తో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర సహా ఇతర పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
ఒప్పో నుంచి మైండ్ బ్లాకింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరా సెటప్‌తో ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ 5జీ గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ 200MP కెమెరా సిస్టమ్ తో వచ్చింది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్. ఈ ఫోన్‌లో వెనుక వైపు మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలను అందించడం విశేషం. ఇందులో 200MP ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 200MP ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.

హాసెల్‌బ్లాడ్ ఇమేజింగ్ కలర్ ట్యూనింగ్, లూమో ట్రూ ఇమేజ్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ, వీడియో ప్రొడక్షన్ కోసం ఈ ఫోన్ 8K 30fps వరకు, 4K 120fps వరకు వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అమర్చారు.

26
శక్తివంతమైన 2nm మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రొ చిప్‌సెట్

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రొ చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 2nm ప్రాసెస్ ఆధారంగా తయారైన ఈ చిప్‌సెట్ మెరుగైన పెర్ఫార్మెన్స్, తక్కువ పవర్ వినియోగాన్ని అందిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవాన్ని మరింత వేగవంతం చేసేలా Arm C2 CPU, Mali-G2 Ultra NX GPU, అడ్వాన్స్‌డ్ AI NPU ప్రాసెసింగ్‌ను ఇందులో చేర్చారు. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ ఎలాంటి లాగ్ అనేది రాదని కంపెనీ పేర్కొంది.

36
సూపర్ స్మూత్ 144Hz ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ 5జీ లో 6.78 ఇంచుల 1.5K ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ బెజెల్స్ కేవలం 1.15mm అతి సన్నగా ఉండడం వల్ల యూజర్లకు ప్రీమియం కంటెంట్ వీవింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. చెతిలో పట్టుకుంటే సూపర్ ఫీల్ వుంటుంది. మొత్తం అన్నింటిలో నెంబర్ వన్ డిస్‌ప్లే ను ఈ ఫోన్ లో అందించారు.

46
బిగ్ బ్యాటరీ.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ 5జీ లో బిగ్ బ్యాటరీని అందించారు. అయితే, ఫోన్ బ్యాటరీ సామర్థ్యం గ్లోబల్ రీజియన్లను బట్టి మారుతుంది. ఐరోపా మార్కెట్లలో 7,150mAh బ్యాటరీ రాగా, ఆసియా మార్కెట్లలో 8,000mAh పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో లభిస్తుంది. ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో మీరు ఫోన్ ను 60 నిమిషాల్లోపే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఆల్ డే బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

56
ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ ఓఎస్ 17

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17 పై పనిచేస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 7, బ్లూటూత్ 6.2, ఎన్‌ఎఫ్‌సీ, ఈసిమ్ సపోర్ట్ ఉన్నాయి. ఇతర ఫీచర్లు గమనిస్తే..

• IP66, IP68, IP69 రేటింగ్‌లు

• 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

• ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్

• షార్ట్‌కట్ కీ లేదా యాక్షన్ బటన్

• యూఎస్ బీ టైప్-సి 3.2 జెన్ 1

• బయోనిక్ వైబ్రేషన్ మోటార్ ప్రో

66
ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ 5జీ గ్లోబల్ ప్రైస్ ఎంత?

యూరోప్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ 5జీ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర €1,800 గా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1,60,000గా ఉంది. యూకే మార్కెట్‌లో £1,500 ధరకు లభిస్తుంది. డిజైన్, రంగులు, కొలతలు

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ టైటానియం గ్రే, డ్యూయల్-టోన్ లూనా వైట్ ఫినిషింగ్‌లలో లభిస్తుంది. దీని మందం 8.4 మి.మీ. కాగా, రంగును బట్టి బరువు మారుతుంది. లూనా వైట్ వేరియంట్ బరువు 233 గ్రాములు కాగా, టైటానియం గ్రే వెర్షన్ బరువు 235 గ్రాములు.

Read more Photos on
click me!

Recommended Stories