ఫోటోగ్రఫీ విభాగంలో ఐక్యూ నియో 11 ఆల్ట్రా వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌లో 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఈ ఫోన్ 5 రకాల స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది
• 8GB RAM + 256GB స్టోరేజ్
• 12GB RAM + 256GB స్టోరేజ్
• 12GB RAM + 512GB స్టోరేజ్
• 16GB RAM + 256GB స్టోరేజ్
• 16GB RAM + 512GB స్టోరేజ్
ఈ ఫోన్ లైట్ వైట్, షాడో బ్లాక్, విండ్ ఛేజర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 3D ఆల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.