ఈ ఫోన్ కేవలం పవర్‌ఫుల్ మాత్రమే కాదు.. చాలా గట్టిది కూడా. దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ధూళి, వాటర్ హైప్రెషర్‌ను కూడా ఇది తట్టుకోగలదు. ఫోన్ కింద పడినా, చిన్నపాటి షాక్స్ తగిలినా ఏం కాకుండా SGS గోల్డ్ స్టాండర్డ్ ఫైవ్-స్టార్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
• 12GB RAM + 256GB వేరియంట్: 3299 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹46,000)
• 12GB RAM + 512GB వేరియంట్: 3599 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹50,000)
• 16GB RAM + 512GB వేరియంట్: 4199 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹60,000)
బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి, భారత మార్కెట్లోకి రానుంది.