డ‌బ్బులున్నాయ‌ని పెద్ద స్క్రీన్ టీవీ కొంటే కుద‌ర‌దు బ్రో.. దానికి కూడా ఓ లెక్క ఉంద‌ని తెలుసా.?

Published : Jul 13, 2026, 08:30 AM IST

Smart TV: ఇప్పుడంతా స్మార్ట్ టీవీల కాలం. కొత్త టీవీ కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా స్క్రీన్ సైజ్‌నే చూస్తారు. "ఎంత పెద్ద టీవీ అయితే అంత మంచి అనుభవం" అని భావించి పెద్ద మోడల్‌ను ఎంచుకుంటారు. అయితే టీవీ కొనుగోలులో చూడాల్సిన అంశాలు ేంటో తెలుసా.?

PREV
15
టీవీ సైజ్‌ను ఎలా ఎంచుకోవాలి?

టీవీ కొనుగోలు చేసే ముందు మీరు టీవీకి ఎంత దూరంలో కూర్చుంటారో తెలుసుకోవాలి. అదే సరైన స్క్రీన్ సైజ్‌ను నిర్ణయిస్తుంది.

* మీరి టీవీకి 6 నుంచి 8 అడుగుల దూరం ఉంటే 43 లేదా 50 అంగుళాల టీవీ సరైన ఎంపికగా చెప్పొచ్చు.

* ఒక‌వేళ 8 నుంచి 10 అడుగుల దూరం ఉంటే 55 అంగుళాల టీవీ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

* అదే 10 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉంటే 65 లేదా 75 అంగుళాల టీవీ మంచి అనుభవాన్ని ఇస్తుంది.

చిన్న గదిలో చాలా పెద్ద టీవీ పెట్టుకుంటే కళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద గదిలో చిన్న టీవీ పెట్టుకుంటే వీక్షణ అనుభవం తగ్గిపోతుంది.

25
టీవీ కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు పరిశీలించండి

టీవీ కొనేముందు గదిని ఒకసారి కొలవడం మంచిది. గోడపై లేదా టీవీ యూనిట్‌లో ఎంత స్థలం ఉందో చూసుకోవాలి. అలాగే కేవలం స్క్రీన్ సైజ్ కాకుండా ఇతర ఫీచర్లను కూడా పరిశీలించాలి. డిస్‌ప్లే రిజల్యూషన్ (HD, Full HD, 4K), రిఫ్రెష్ రేట్, ఆపరేటింగ్ సిస్టమ్, స్పీకర్ నాణ్యత, స్ట్రీమింగ్ యాప్‌ల సపోర్ట్, HDMI, USB, Wi-Fi వంటి కనెక్టివిటీ. ఈ ఫీచర్లు రోజువారీ వినియోగంలో చాలా ఉపయోగపడతాయి.

35
చిన్న గది, మధ్యస్థ గది, పెద్ద గదికి ఏ టీవీ బెస్ట్?

చిన్న గది:

బెడ్‌రూమ్ లేదా చిన్న గదులకు 32 లేదా 43 అంగుళాల టీవీ సరిపోతుంది. మంచి కలర్స్ కోసం QLED టీవీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. Google TV వంటి స్మార్ట్ ప్లాట్‌ఫామ్ ఉంటే OTT యాప్‌లను సులభంగా ఉపయోగించవచ్చు.

మధ్యస్థ లివింగ్ రూమ్:

మధ్యస్థ పరిమాణం ఉన్న లివింగ్ రూమ్‌కు 55 అంగుళాల 4K టీవీ మంచి ఎంపిక. HDR10, MEMC వంటి టెక్నాలజీలు ఉండటం వల్ల స్పోర్ట్స్, యాక్షన్ సినిమాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

పెద్ద హాల్:

పెద్ద గదులకు 75 అంగుళాల QLED 4K టీవీ ఉత్తమ ఎంపిక. Dolby Vision, 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Atmos వంటి ఫీచర్లు సినిమాలు, గేమింగ్‌కు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

45
43, 50, 75 అంగుళాల్లో ఏది కొనాలి?

మీ అవసరాన్ని బట్టి టీవీని ఎంచుకోవడం ఉత్తమం. చిన్న గది, తక్కువ బడ్జెట్ కోసం చూస్తున్న వారికి 32 ఇంచెస్ ఉత్తమం. అదే విధంగా చిన్న నుంచి మధ్యస్థ గదులకు 43 ఇంచెస్ సరైన ఎంపికగా చెప్పొచ్చు. కుటుంబ వినియోగానికి, సాధారణ లివింగ్ రూమ్‌కు 50 ఇంచెస్ అనుకూలంగా చెప్పొచ్చు. అలాగే మధ్యస్థ గదిలో సినిమాలు, OTT కోసం 55 ఇంచెస్ ఉత్త‌మంగా చెప్పొచ్చు. ఇక పెద్ద హాల్, హోమ్ థియేటర్ అనుభవం కోరుకునేవారికి 75 ఇంచెస్ బెస్ట్ ఆప్ష‌న్‌.

55
టీవీ కొనుగోలు సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

కొత్త టీవీ కొనేటప్పుడు కొన్ని అంశాలను తప్పకుండా పరిశీలించండి. గది పరిమాణానికి సరిపోయే స్క్రీన్ సైజ్ ఎంచుకోండి. పెద్ద స్క్రీన్ అయితే 4K రిజల్యూషన్ ఉండేలా చూడండి. Google TV, Tizen లేదా webOS వంటి మంచి ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంపిక చేయండి. Dolby Audio లేదా Dolby Atmos సపోర్ట్ ఉన్న టీవీలకు ప్రాధాన్యం ఇవ్వండి. HDMI, USB, Wi-Fi, Bluetooth వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించండి.

మీ బడ్జెట్‌కు తగ్గట్టే, అవసరమైన ఫీచర్లతో ఉన్న టీవీని ఎంచుకుంటే డబ్బుకు సరైన విలువ లభిస్తుంది. సరైన స్క్రీన్ సైజ్, మంచి డిస్‌ప్లే, నాణ్యమైన సౌండ్, అవసరమైన స్మార్ట్ ఫీచర్లు ఉన్న టీవీని ఎంపిక చేసుకుంటే ఎన్నో సంవత్సరాల పాటు ఉత్తమమైన వినోద అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories