Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ లో ధమాకా ఆఫర్లు ఉన్నాయి. ఫెస్టివ్ సీజన్ కోసం కేవలం రూ. 5,799 ఆరంభ ధరతో కొత్త స్మార్ట్ టీవీలు అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు మీకోసం.
దసరా, దివాళీ పండుగల వేళ కొత్త స్మార్ట్ టీవీ కొందామని చూస్తున్న వారికి థామ్సన్ అదిరిపోయే వార్త చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే తన కొత్త స్మార్ట్ టీవీల రేంజ్‌ను భారత మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ప్రతి ఒక్కరి బడ్జెట్, అవసరాలకు తగ్గట్లుగా వేర్వేరు స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీ రెడీ, ఫుల్ హెచ్డీ, క్యూఎల్ఈడీ, మినీ క్యూరీ 4కే మోడల్స్ ఇందులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర కేవలం ₹5,799 మాత్రమే కావడం విశేషం. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రస్తుత సేల్ లో అందుబాటులో ఉన్నాయి.
25
రూ. 32,999 కే 55 ఇంచుల ప్రీమియం మినీ క్యూడీ 4కే టీవీ
ఈ కొత్త రేంజ్‌లో అత్యంత ప్రత్యేకమైనది 55 ఇంచుల మినీ క్యూడీ 4కే టీవీ. దీని ధరను ₹32,999 గా నిర్ణయించారు. ఈ టీవీలో Mini-QD డిస్‌ప్లే టెక్నాలజీ ఉపయోగించారు. ఇది 1.1 బిలియన్ కలర్స్, 550 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. గేమర్స్, స్పోర్ట్స్ ప్రేమికుల కోసం 120Hz HSR, వీఆర్ఆర్, ఏఎల్ఎల్ఎం ఫీచర్లు ఇచ్చారు.
సౌండ్ విషయానికొస్తే, ఇందులో 80W డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్ సిస్టమ్ తో 4 స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ టీవీ ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో భలే స్టైలిష్‌గా కనిపిస్తుంది.
35
జియోటెలి ఓఎస్‌తో 65 ఇంచుల బిగ్ స్క్రీన్ క్యూఎల్ఈడీ టీవీ
ఇంటిని థియేటర్‌లా మార్చాలనుకునే వారి కోసం థామ్సన్ 65 ఇంచుల క్యూఎల్ఈడీ టీవీని కూడా పరిచయం చేసింది. ఇది ప్రత్యేకంగా జియోటెలీ ఓఎస్ పై నడుస్తుంది. 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, 1.1 బిలియన్ రంగులు, 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో విజువల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. జియో టెలీ ఓఎస్ ద్వారా యూజర్లు 300 కన్నా ఎక్కువ ఉచిత లైవ్ టీవీ ఛానెళ్లు, 300 పైగా జియో గేమ్స్, ప్రధాన ఓటీటీ యాప్‌లను నేరుగా చూడవచ్చు. ఇందులో 48W డాల్బీ ఆడియో, స్పోర్ట్స్ మోడ్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. అలాగే, థామ్సన్ లో తక్కువ ధరలోనే గూగుల్ టీవీని కూడా తీసుకొచ్చింది.
థామ్సన్ తన ఆల్ఫా క్యూఎల్ఈడీ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా 50 ఇంచుల మోడల్‌ను చేర్చింది. ఫుల్ హెచ్డీ క్యూఎల్ఈడీ ప్యానెల్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ టీవీ ధర ₹21,999. ఇది కూలిటా 3.0 ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇందులో 40 వాట్స్ సరౌండ్ సౌండ్, మిరాకాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు లైవ్ ఛానెళ్లు, స్ట్రీమింగ్ యాప్‌లు సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
55
తక్కువ బడ్జెట్‌లో టాప్ ఫీచర్లు
కేవలం పెద్ద స్క్రీన్లే కాకుండా 40 ఇంచ్, 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ, 32, 22 ఇంచెస్ హెచ్డీ స్మార్ట్ టీవీలను కూడా కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో A+ గ్రేడ్ ప్యానెల్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 36 వాట్స్ స్టీరియో సౌండ్ లభిస్తాయి. పరికరాలు కనెక్ట్ చేయడానికి హెచ్డీఎంఐ, యూఎస్బీ, వీజీఏ, ఏవీ పోర్టులు ఉన్నాయి. రూ. 5,799 ప్రారంభ ధరతో లభించే ఈ టీవీలు తక్కువ బడ్జెట్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. ఇవన్నీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.