Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే

Published : Oct 09, 2026, 11:54 AM IST

Smartphone Deals: పండుగల సీజన్ వేళ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కళ్లుచేదిరే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సూపర్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ వచ్చాయి.

PREV
16
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17, గెలాక్సీ S25 అల్ట్రా పై ఊహించని డిస్కౌంట్స్

ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ సేల్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అందరి వినియోగదారులకు ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చేశాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి దుస్తుల వరకు అన్ని కేటగిరీలలోనూ బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను కంపెనీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ సేల్‌లో వేల రూపాయలు ఆదా చేసుకునేలా అందుబాటులో ఉన్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

26
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17 పై సూపర్ ఆఫర్

ఈసారి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్ ఐఫోన్ 17 అని చెప్పవచ్చు. ఇటీవల ఈ పాపులర్ హ్యాండ్‌సెట్ అసలు ధరను రూ. 99,900 వరకు నిర్ణయించగా, ప్రస్తుత సేల్‌ సమయంలో దీనిని కేవలం రూ. 81,999 ల్యాండింగ్ ధరకు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌ను రూ. 76,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 17 విశేషాల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే రెండు కెమెరా సెన్సార్లు 48MP + 48MP కావడం గమనార్హం. అలాగే ఇది 6.3 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

36
శాంసంగ్ గెలాక్సీ S25 5G ధర పై మైండ్ బ్లాకింగ్ డీల్

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రముఖ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 5G ని కూడా చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్, రూ. 70,000 నుంచి రూ. 90,000 సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

సాంకేతిక వివరాలు చూస్తే, ఈ ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అలాగే గ్రాఫిక్స్ కోసం Adreno 830 GPU సపోర్ట్ దీనికి ఉంది.

46
అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా పై బంపర్ ఆఫర్

అటు అమెజాన్ ఇండియాలో నడుస్తున్న సేల్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా పై ఊహించని రేంజ్‌లో ఆఫర్లు లభిస్తున్నాయి. సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ. 94,999 ధరకు లిస్ట్ అయ్యింది. దీనిపై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్‌తో పాటు రూ. 7,741 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను అందించారు. దాంతో పాటు స్టైలస్ ఎస్‌ పెన్ సపోర్ట్ కూడా లభిస్తుంది. మెరుపు వేగం లాంటి పర్ఫార్మెన్స్ కోసం ఇందులో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్‌ను అందించారు.

56
ఐఫోన్ 16 పై అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైస్

అమెజాన్ ఇండియా సేల్‌లో ఐఫోన్ 16 మోడల్ అన్ని ఆఫర్లు కలుపుకుని రూ. 72,249 ధరకు అందుబాటులోకి వచ్చింది. గత నెలలోనే యాపిల్ దీని ధరను రూ. 89,900 గా నిర్ణయించింది. ఈ ధర 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది.

ఐఫోన్ 16 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

66
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 పై భారీ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ S23 పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కిల్లింగ్ ఆఫర్ ఉంది. 80 వేలకు పైగా ప్రైస్ తో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 26 వేలకే సేల్ లోకి వచ్చింది. అయితే, తక్కువ నెంబర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. స్టాక్ అందుబాటులో ఉంటే మీరు చెక్ చేయండి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉపయోగించారు. 50+10+12 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ తో అద్బుతమైన ఫోటోలో, వీడియోలు తీయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories