Lionel Messi: బాస్ ఈజ్ బ్యాక్.. ఎవడ్రా ఆపేది ! ఫిపా వరల్డ్ కప్‌లో మెస్సి హిస్టారికల్ రికార్డ్

Published : Jun 28, 2026, 01:05 PM IST

Lionel Messi: లియోనెల్ మెస్సి వరల్డ్ కప్‌లో వరుసగా 7 మ్యాచుల్లో గోల్స్ కొట్టి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మార్తా, పెలే రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచి మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

PREV
16
మెస్సి అంటే రికార్డు.. రికార్డు అంటే మెస్సి ! ఆ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే

ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సి పేరు వింటేనే రికార్డులు వణికిపోతాయి. ఇప్పుడు వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక సంచలన రికార్డును ఈ అర్జెంటీనా లెజెండ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో వరుసగా 7 మ్యాచుల్లో గోల్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా మెస్సి సరికొత్త చరిత్ర సృష్టించాడు. జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి గోల్ కొట్టడంతో ఈ అల్టిమేట్ రికార్డ్ బద్దలైంది. గ్రౌండ్‌లోకి దిగితే చాలు గోల్స్ కొట్టడం, రికార్డులు బ్రేక్ చేయడం మెస్సికి అలవాటుగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే రిపీట్ అయింది.

26
మెస్సీ దెబ్బతో లెజెండ్స్ రికార్డులు గాల్లో కలిసిపోయాయ్

మెస్సి తన అద్భుతమైన ఫామ్‌తో ఫుట్‌బాల్ లెజెండ్స్ రికార్డులను దాటేశాడు. ఫ్రెంచ్ లెజెండ్ జస్ట్ ఫోంటైన్ (1958), బ్రెజిలియన్ ఐకాన్ జైర్‌జిన్హో (1970)లు గతంలో వరుసగా 6 వరల్డ్ కప్ మ్యాచుల్లో గోల్స్ కొట్టి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు మెస్సి వరుసగా 7వ మ్యాచ్‌లోనూ గోల్ కొట్టి వాళ్లిద్దరినీ వెనక్కి నెట్టేశాడు. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో ప్రీ-క్వార్టర్స్ (ఆస్ట్రేలియా), క్వార్టర్స్ (నెదర్లాండ్స్), సెమీస్ (క్రొయేషియా), ఫైనల్ (ఫ్రాన్స్) మ్యాచులతో పాటు.. ఇప్పుడు జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ మూడు మ్యాచుల్లోనూ మెస్సి వరుసగా గోల్స్ కొడుతూ వస్తున్నాడు.

36
మార్తా, పెలే రికార్డులు బద్దలు.. ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ మెస్సీ

ఈ వరల్డ్ కప్‌లో బ్రెజిలియన్ మహిళా ఫుట్‌బాల్ స్టార్ మార్తా రికార్డును బ్రేక్ చేసిన మెస్సి, వరల్డ్ కప్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డాన్‌పై కొట్టిన గోల్‌తో కలిపి వరల్డ్ కప్‌లో మెస్సి మొత్తం గోల్స్ సంఖ్య 19కి చేరింది. ఇంకా నాకౌట్ రౌండ్లు మొదలవ్వక ముందే మెస్సి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం విశేషం. అంతేకాదు, వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్‌లో భాగస్వామ్యం ఉన్న బ్రెజిల్ లెజెండ్ పెలే రికార్డును కూడా మెస్సి ఇదివరకే దాటేశాడు. పెలే 14 మ్యాచుల్లో 12 గోల్స్, 9 అసిస్టులతో ఉండగా.. మెస్సి ఇప్పుడు 19 గోల్స్, 8 అసిస్టులతో (మొత్తం 27) టాప్‌లో దూసుకుపోతున్నాడు.

46
మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్.. అత్యధిక విజయాల రికార్డ్ మెస్సీ సొంతం

జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్‌లోకి వచ్చిన మెస్సి, వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా తన రికార్డును మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు. మెస్సికి ఇది 29వ వరల్డ్ కప్ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్‌లో జోర్డాన్‌పై అర్జెంటీనా సూపర్ విక్టరీ కొట్టడంతో.. వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక విజయాలు (19 విజయాలు) అందుకున్న ప్లేయర్‌గా మెస్సి నిలిచాడు. ఇకపోతే, క్రిస్టియానో రొనాల్డోతో కలిసి 6 వేర్వేరు వరల్డ్ కప్‌లలో నేరుగా ఆడిన అరుదైన రికార్డును కూడా మెస్సి ఇదివరకే షేర్ చేసుకున్నాడు.

56
అన్ని స్టేజీల్లోనూ గోల్స్.. మెస్సి ఒక్కడికే సాధ్యం

వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక అసాధ్యమైన రికార్డు మెస్సి పేరు మీద ఉంది. గ్రూప్ స్టేజ్, ప్రీ-క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్, ఆ తర్వాత ఫైనల్.. ఇలా వరల్డ్ కప్‌లోని ప్రతి ఒక్క స్టేజ్‌లోనూ గోల్స్ కొట్టిన ఏకైక ఫుట్‌బాలర్‌గా మెస్సి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రెజర్ ఎంత ఉన్నా సరే, మ్యాచ్ ఎంత పెద్దదైనా సరే మెస్సి బూట్లు గోల్స్ కొట్టడం ఆపవని ఈ రికార్డే ప్రూవ్ చేస్తోంది.

66
టార్గెట్ గోల్డెన్ బూట్.. ఆ హిస్టరీ మారుతుందా?

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి మెస్సి 6 గోల్స్‌తో టాప్ స్కోరర్ల లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే ఇంత పెద్ద కెరీర్‌లో మెస్సి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ గెలవలేదు. పోయినసారి ఖతార్ వరల్డ్ కప్‌లో మెస్సి 7 గోల్స్ కొట్టినా.. ఫైనల్‌లో హ్యాట్రిక్‌తో కలిపి మొత్తం 8 గోల్స్ కొట్టిన ఎంబాప్పే ఆ అవార్డును ఎగరేసుకుపోయాడు.

మెస్సి వరల్డ్ కప్ జర్నీ చూస్తే.. 2006లో 1 గోల్ కొట్టాడు. 2010లో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. 2014లో 4 గోల్స్, 2018లో 1 గోల్, 2022లో 7 గోల్స్ కొట్టగా.. ఈ 2026 వరల్డ్ కప్‌లో అప్పుడే 6 గోల్స్ కొట్టేశాడు. అర్జెంటీనా తరపున గతంలో 1930లో గిల్లెర్మో స్టాబిలే, 1978లో మారియో కెంపెస్ మాత్రమే గోల్డెన్ బూట్ గెలిచారు. మరి ఈసారి మెస్సి ఆ హిస్టరీని తిరగరాసి ఫస్ట్ టైమ్ గోల్డెన్ బూట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories