మెస్సీని దాటేసిన టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ... ఇక రొనాల్డో మాత్రమే...

First Published Jun 8, 2021, 12:52 PM IST

భారత ఫుట్‌బాల్ స్టార్, టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ... అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించి, అత్యధిక గోల్స్ చేసిన రెండో ఫుల్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

2020 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ కూడా కెప్టెన్ సునీల్ ఛెత్రీ సాధించినవే కావడం విశేషం.
undefined
వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత జట్టుకి గత ఆరేళ్లలో దక్కిన మొదటి విజయం ఇదే. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్స్‌తో 103 అంతర్జాతీయ గోల్స్ చేసిన పోర్చుగల్ సూపర్ హీరో క్రిస్టియానో రొనాల్డో తర్వాతి స్థానంలో నిలిచాడు సునీల్ ఛెత్రీ...
undefined
బర్సిలోనా స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 72 గోల్స్ సాధించగా... తాజాగా సునీల్ ఛెత్రీ సాధించిన రెండు గోల్స్‌తో అతని గోల్స్ సంఖ్య 74కి చేరింది. దీంతో ప్రస్తుత తరంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన రెండో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నిలిచాడు సునీల్ ఛెత్రీ..
undefined
గురువారం వరల్డ్‌కప్ క్వాలిఫైయర్‌లో చీలితో జరిగిన మ్యాచ్‌లోతన 72వ అంతర్జాతీయ గోల్ సాధించాడు మెస్సీ... అలాగే ఆల్‌టైం టాప్ 10 హైయెస్ట్ గోల్స్‌ చేసిన ప్లేయర్ల లిస్టులో చేరడానికి ఒకే ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు సునీల్ ఛెత్రీ.
undefined
జపాన్‌ మాజీ ప్లేయర్ కునిషిగే కమామోటో, కువైట్ మాజీ ప్లేయర్ బషర్ అబ్దుల్లా కలిసి తమ కెరీర్‌లో 75 గోల్స్ సాధించి... సంయుక్తంగా టాప్ 10లో ఉన్నారు. సునీల్ ఛెత్రీ మరో గోల్ సాధిస్తే వీరితో సమానంగా... మరో రెండు గోల్స్ సాధిస్తే వీరిని అధిగమించి ఆల్‌టైం హైయెస్ట్ టాప్ గోలర్స్‌ లిస్టులోకి చేరతాడు.
undefined
‘మన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ తన కెరీర్‌లో మరో అరుదైన ఫీట్ సాధించాడు. అతని పట్టువదలని ఆటతీరుతో మెస్సీని అధిగమించి, అత్యధిక గోల్స్ సాధించిన రెండో యాక్టీవ్ ప్లేయర్‌గా నిలిచాడు. కెప్టెన్‌కి ప్రత్యేక అభినందనలు... ఇలాంటి మరిన్ని రికార్డులు ఆయన ఖాతాలో చేరాలని కోరుకుంటున్నా’ అంటూ ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ట్వీట్ చేశారు.
undefined
ఈ విజయంతో ఏడు మ్యాచుల్లో ఆరు పాయింట్లు సాధించిన భారత జట్టు, గ్రూప్ ఈలో మూడో స్థానానికి చేరుకుంది. భారత ఫుట్‌బాల్ జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను జూన్ 15న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. ఇప్పటికే 2022 వరల్డ్‌కప్‌కి అర్హత సాధించలేకపోయిన భారత జట్టు, చైనాలోజ జరిగే ఆసియా కప్‌కి అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది.
undefined
click me!