FIFA World Cup Final 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే, ఐదేళ్ల క్రితం ఒక యూజర్ చేసిన మ్యాచ్ స్కోర్ ప్రిడిక్షన్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ సారి ఫైనల్ పోరులో ఛాంపియన్ గా నిలిచే జట్టు ఏది?
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విన్నర్ ఎవరో ముందే తెలిసిపోయిందా? 5 ఏళ్ల క్రితమే ఫైనల్ స్కోర్ చెప్పేశాడు !
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతోంది. ఈ రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయని, మ్యాచ్ స్కోర్ ఎంత ఉంటుందో ఐదేళ్ల క్రితమే ఒకరు ఊహించారు. 2021లో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇది చూసిన ఫుట్‌బాల్ అభిమానులు షాక్ అవుతున్నారు.
25
సెమీఫైనల్స్ తర్వాత పెరిగిన క్రేజ్
రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు స్పెయిన్ జట్టు ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరగానే.. 'డిలెమా' అనే ఎక్స్ యూజర్ 2021 జూలై 11న చేసిన పాత పోస్ట్ వెలుగులోకి వచ్చింది. అందులో 2026 వరల్డ్ కప్ ఫైనల్ అప్‌డేట్ ముందే రాసి ఉంది.
Argentina just beat Spain at the 2026 World Cup final, 3-2.
— dilemma (@actuallyimthe) July 11, 2021
35
ట్వీట్‌లో ఏముందంటే?
"అర్జెంటీనా జట్టు 2026 వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్‌ను 3-2 తేడాతో ఓడించింది" అని సదరు యూజర్ 2021లో పోస్ట్ చేశాడు. అప్పట్లో లియోనెల్ మెస్సీ టీమ్ 2022 ఖతార్ వరల్డ్ కప్ కూడా గెలవలేదు. అలాంటిది ఐదేళ్ల తర్వాత జరగబోయే మ్యాచ్ గురించి ఇంత పక్కాగా రాయడం విశేషం. ఒకవేళ ఫైనల్‌లో నిజంగానే అర్జెంటీనా 3-2తో గెలిస్తే మాత్రం ఈ పోస్ట్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది.
ఈ వైరల్ ట్వీట్ చూసి మెస్సీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టోర్నమెంట్‌లో మెస్సీ ఇప్పటివరకు 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా నాలుగోసారి ట్రోఫీ గెలవాలని చూస్తోంది. గతంలో 1978, 1986, 2022లో అర్జెంటీనా వరల్డ్ కప్స్ గెలిచింది. మరోవైపు స్పెయిన్ జట్టు 2010 తర్వాత రెండోసారి వరల్డ్ కప్ టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది.
55
ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ?
అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 48 దేశాల మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. జూలై 19 ఆదివారం నాడు న్యూయార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు దేశాల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. గతంలో 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్, 2024 కోపా అమెరికా గెలిచిన అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉన్నా అది రద్దయింది. ఇప్పుడు నేరుగా వరల్డ్ కప్ ఫైనల్లోనే ఈ రెండు జట్లు తేల్చుకోనున్నాయి.