Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. ఎవరికీ అందనంత ఎత్తులో సాకర్ దిగ్గజం

First Published | Oct 10, 2022, 1:13 PM IST

Cristiano Ronaldo 700th goal: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత దక్కించుకున్నాడు.  తన కెరీర్ లో 700వ గోల్ కొట్టాడు. 

పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో  అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  మాంచెస్టర్ యూనైటెడ్ జట్టుకు ఆడుతున్న  రొనాల్డో.. ఎవర్టన్ తో మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా తన  ఫుట్‌బాల్ లీగ్స్ కెరీర్ లో 700వ గోల్ కొట్టాడు.  
 

ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో రొనాల్డో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పోర్చుగల్ తరఫున ఆడుతూ 117 గోల్స్ కొట్టిన రొనాల్డో.. లీగ్స్ లో 700 గోల్స్ పూర్తి చేసుకున్నాడు.  మొత్తంగా తన కెరీర్ లో   ఈ సాకర్ దిగ్గజం  817 గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 


Image Credit: Getty Images

క్లబ్స్ తరఫున రొనాల్డో గోల్స్ ను ఓ సారి పరిశీలిస్తే.. తన కెరీర్ ప్రారంభంలో  ఆడిన స్పోర్టింగ్ అప్ తరఫున 5 గోల్స్ కొట్టాడు. రియల్ మాడ్రిడ్ తరఫున 450 గోల్స్ కొట్టిన  అతడు.. జువెంటస్ కు ఆడుతూ 101 గోల్స్ చేశాడు. ఇక మాంచెస్టర్ యూనైటెడ్ కు ఆడుతూ 144 గోల్స్ కొట్టాడు. 

ఈ జాబితాలో  ఆస్ట్రియాకు చెందిన  జోసెఫ్ బికన్  (1934-1956) 805 గోల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.  లీగ్స్ లో దుమ్మురేపిన బికన్.. తన దేశం తరఫున 32 గోల్స్ మాత్రమే చేశాడు. అయితే ఆధునిక కాలంలో దిగ్గజాలుగా వెలుగొందుతున్న లియోనల్ మెస్సీ.. రొనాల్డో తర్వాత స్థానంలో ఉన్నాడు. 

ప్రస్తుతం మెస్సీ..  781 గోల్స్ తో రొనాల్డో తర్వాత స్థానంలో ఉన్నాడు. మెస్సీ.. 90 అంతర్జాతీయ గోల్స్ కొట్టగా.. క్లబ్స్ స్థాయిలో 691 గోల్స్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య అంతరం  తక్కువే అయినా రొనాల్డోనే దూసుకుపోతున్నాడు. 
 

Image credit: PTI

క్లబ్స్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చూస్తే రొనాల్డో (117) తర్వాత అలి డాయి (ఇరాన్ - 109), లియోనల్ మెస్సీ (90), మొక్తర్ దహరి (మలేషియా- 89), ఫెరెన్క్ పుకస్ (హంగేరి - 84) ల తర్వాత భారత ఫుట్బాల్ సారథి సునీల్ ఛెత్రి 84 గోల్స్ తో ఐదో స్థానంలో ఉన్నాడు. 

Latest Videos

click me!