రైస్ తో కలిసి వీటిని అస్సలు తీసుకోకూడదు తెలుసా?

First Published | May 4, 2023, 1:52 PM IST

ఈ రైస్ తోపాటు కొన్ని ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైస్ తో పాటు కలిపి తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం..
 

మనం ప్రతిరోజూ ఆహారంగా రైస్ తీసుకుంటాం. అయితే.. ఈ రైస్ తోపాటు కొన్ని ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైస్ తో పాటు కలిపి తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం..
 

1.చపాతి..

మనం అన్నంతో పాటు, చపాతిలను తీసుకోకూడదట. చాలా మంది చపాతి తో పాటు అన్నం కూడా తింటూ ఉంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ మంచిది కాదట. ఈ రెండింటిలోనూ గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల బ్లోటింగ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
 


Image: Getty Images

2.ఆలుగడ్డ..

మనలో చాలా మంది అన్నంతో పాటు పొటాటో కర్రీ, పొటాటో ఫ్రై తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ రెండింటినీ కలిపి అస్సలు తీసుకోకూడదట. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో  క్యాలరీ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ రెండూ మీరు తీసుకోవాలి అనుకుంటే.. కొద్దిగా మాత్రమే తీసుకోవాలి.

Image: Getty

3.పండ్లు..
చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ రైస్ తిన్న వెంటనే పండ్లు అస్సలు తినకూడదట. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు.
 

4.టీ..

చాలా మందికి టీ తాగడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ, రైస్ తిన్న తర్వాత టీ అస్సలు తాగకూడదట. దీని వల్ల కూడా బ్లోటింగ్ సమస్యలు ఎక్కువగా వస్తాయట.
 

salad

5.సలాడ్స్..
సలాడ్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కానీ, ఆహారం తీసుకున్న వెంటనే మాత్రం సలాడ్స్ అస్సలు తీసుకోకూడదు. అరుగుదల సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

corn


6.స్టార్చ్ వెజిటేబుల్స్..
చాలా మందికి రైస్ తో భోజనం చేసిన తర్వాత మొక్క జొన్న, బఠాణి వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవాశం ఉందట.  ఒకవేళ వీటిని తీసుకున్నా, తక్కువ మొత్తంలో తీసుకోవాలట. కావాలంటే ఇలాంటి భోజనం తీసుకున్నప్పుడు పెరుగు కచ్చితంగా తీసుకోవాలి.

Latest Videos

click me!