బరువు పెరగాలంటే ఏ రోటీ తినాలి?

First Published Jun 6, 2024, 9:58 AM IST

కొంతమంది బరువు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో రకాల ఆహారాలను తింటుంటారు. కానీ రకాల రోటీలు మీరు ఆరోగ్యంగా బరువు పెరిగేలా చేస్తాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం పదండి. 

బరువు పెరగడం ఆరోగ్యానికి ఎంత మంచిది కాదో.. ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం కూడా అంతే మంచిది కాదు. సన్నగా ఉండటం వల్ల లేనిపోని వ్యాధులు వస్తాయి. మీరు చాలా సన్నగా ఉండి, శరీరంపై కొవ్వు పెరగాలనుకుంటే కొన్ని రకాల రోటీలను తినండి. ఇవి మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే బరువు పెరగడానికి ఎలాంటి రోటీలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కొబ్బరి పిండి

కొబ్బరి పిండిలో గ్లూటెన్ మొత్తమే ఉండదు. ఇది ఎండిన కొబ్బరిని గ్రైండ్ చేయడం ద్వారా తయారవుతుంది. ఈ పిండిలో గోధుమ పిండి కంటే ఎక్కువ కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు, ఫైబర్, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పిండి మీ బరువును ఆరోగ్యంగా పెంచడానికి సహాయపడుతుంది.
 

Latest Videos



బాదం పిండి

బాదం పిండి సహజంగా గ్లూటెన్ లేనిది. బాదం పిండిలో మెగ్నీషియం, ఒమేగా -3 అసంతృప్త కొవ్వు, ప్రోటీన్,  విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో మంచి మొత్తంలో ప్రోటీన్ కంటెంట్ కూడా  ఉంటుంది. ఇది మీరు బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది.

క్వినోవా పిండి

క్వినోవా పిండి కూడా మీరు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్, ఇనుము, అసంతృప్త కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీరు వేగంగా బరువు పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు ఈ పిండి రొట్టెను తినొచ్చు. 
 

roti ke upay

బుక్వీట్ పిండి

బుక్వీట్ పిండి ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఇనుము, భాస్వరం వంటి సూక్ష్మపోషకాలకు మంచి మూలం. దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బరువు కూడా పెరుగుతారు. 
 

బియ్యం పిండి

బియ్యం పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును ఫాస్ట్ గా పెంచుతుంది. మీరు బరువు పెరగడానికి ప్రతిరోజూ బియ్యం పిండి రొట్టెను తినొచ్చు. 
 

రాగి పిండి

రాగిపిండిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రోటీ తినడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు కూడా పెరుగుతారు. 
 


ఓట్స్ పిండి

ఓట్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ పిండి రొట్టే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీరు ఫాస్ట్ గా బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. 

click me!