ఎండాకాలంలో చల్ల చల్లగా ఉండే ఆహారాలనే తినడానికి ఇష్టపడతారు. ఈ సీజన్ లో శరీరాన్ని లోపలి నుంచి చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికని చాలా మంది పెరుగును బాగా తింటుంటారు. వేసవిలో పెరుగుతో పాటుగా మజ్జిగ, లస్సీ ని బాగా తీసుకుంటుంటారు. నిజానికి పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు ప్రోబయోటిక్ కు గొప్ప వనరు. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చాలా మంది వేసవిలో రాత్రిపూట కూడా పెరుగును రాత్రి భోజనంతో తింటుంటారు. అసలు ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.