మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 11, 2024, 1:45 PM IST

మనలో చాలా మంది మునగాకును ఎన్నో విధాలుగా తింటుంటారు. దీని వాడకం వల్ల ఆరోగ్యానికే కాదు మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు మునగాకు మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మునగాకు మంచి పోషకాహారం. అందుకే దీనిని వండర్ ట్రీ లేదా ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. దీన్ని వేలాది సంవత్సరాలుగా ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. మునగాకులో ఓట్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫైబర్, క్యారెట్ల కంటే రెట్టింపు విటమిన్ ఎ, పాల కంటే ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం, బచ్చలికూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది.
 

దీని కాయలు మాత్రమే కాదు, మునగ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  చాలా మంది దీని ఆకుల పొడిని తయారు చేసి ఔషధంగా ఉపయోగిస్తారు. మరి మునగాకు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

మూత్రపిండాలకు ప్రయోజనకరం

మునగాకు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలను 50% తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల విష స్థాయిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

ఉబ్బసం

మునగాకు ఆస్తమాను పేపెంష్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆస్తమాను నయం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కూడా తగ్గిస్తుంది. 

డయాబెటిస్ 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మూత్రంలో చక్కెర,ప్రోటీన్ మొత్తాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
 

కొలెస్ట్రాల్ నియంత్రణ

ఉదయం టీ, కాఫీలకు బదులుగా మునగాకు టీని తాగితే మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. అలాగే శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 

బరువు మెయింటైన్ 

మునగాకు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచి ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మీ బరువు కంట్రోల్ అవుతుంది. ఈ ఆకుల్లో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. 
 

చర్మం తెల్లబడటం

మునగాకు ఆరోగ్యంతో పాటుగా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును దీని ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఇది ముఖంపై మొటిమలను కూడా తగ్గిస్తుంది.

Latest Videos

click me!