బరువు తగ్గాలని రాత్రి భోజనం మానేస్తే ఏమౌతుంది..?

First Published | Jun 10, 2024, 3:27 PM IST

ఒక వారం రోజులు డిన్నర్ తినడం మానేస్తే.. బరువు తగ్గినట్లు కనిపించడంతో.. అందరూ అదే ఫాలో అవుతారు. కానీ... ఇది మంచి పద్దతేనా..? రాత్రి భోజనం రోజూ మానేయడం వల్ల కలిగే నష్టాలేంటి..?
 

శరీర బరువు తగ్గించేందుకు ఎవరు తోచిన పనులు వాళ్లు చేస్తారు. కొందరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. కొందరు డిన్నర్ మానేస్తారు. ఇక కొందరు అయితే.. రోజుకి ఒక్కపూట మాత్రమే అంటే.. మధ్యాహ్నం మాత్రమే తింటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. రోజు మొదలు అయ్యే ది ఉదయమే కాబట్టి... బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. లంచ్ కూడా తినాలి. ఇక.. అందరికీ ఈజీగా కనపడేది కేవలం డిన్నర్ మాత్రమే. 
 

దీంతో.. ఎక్కువ మంది డిన్నర్ మానేస్తూ ఉంటారు. ఒక వారం రోజులు డిన్నర్ తినడం మానేస్తే.. బరువు తగ్గినట్లు కనిపించడంతో.. అందరూ అదే ఫాలో అవుతారు. కానీ... ఇది మంచి పద్దతేనా..? రాత్రి భోజనం రోజూ మానేయడం వల్ల కలిగే నష్టాలేంటి..?


ఉదయం, మధ్యాహ్నం తిన్నాం కదా అని రాత్రి అవసరం లేదులే అని చాలా మంది అనుకుంటారు. కానీ.. రాత్రి భోజనంలోనూ మన శరీరానికి అవసరం అయిన కేలరీలు, పోషకాలు అందుతాయి. డిన్నర్ స్కిప్ చేయడం వల్ల.. అవి శరీరానికి అందకుండా పోతాయి.
 


బరువు తగ్గే విషయానికి వస్తే డిన్నర్‌ను స్కిప్ చేయడం స్వల్పకాలిక ప్రయోజనాలను తెచ్చిపెడుతుండగా, దీర్ఘకాలంలో వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఇది శరీరంలోని జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుందని , ఆకలిని పెంచుతుందని చెబుతారు. ఇది సూక్ష్మపోషకాల లోపాలను కూడా కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుంది. శక్తి స్థాయిలు తగ్గుతాయి.


రాత్రి భోజనాన్ని దాటవేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు, ఇది జిట్టర్లు లేదా తక్కువ శక్తి  భావాలకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, భోజనం మానేయడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్పైక్‌లు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. భోజనం మానేయడం మానసిక ఆరోగ్యానికి హానికరం. ఇన్నోవేషన్ ఇన్ ఏజింగ్ అనే జర్నల్‌లో 2020లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, భోజనం మానేసే వృద్ధులు డిప్రెషన్, ఆందోళన , నిద్రలేమి లక్షణాలను అనుభవించే అవకాశం ఉంది.

dinner

సరైన సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!