
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడే వాటిలో పాప్ కార్న్ ముందు వరసలో ఉంటుంది. సినిమాకు వెళ్లినా, బటయకు వెళ్లినా పిల్లలు పాప్ కార్న్ కొనివ్వమని అడుగుతూనే ఉంటారు. ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీంతో.. అందరూ తింటూ ఉంటారు. మరి, ఈ పాప్ కార్న్ రోజూ తినడం మంచిదేనా? తింటే ఏమౌతుంది?
పాప్ కార్న్ మొక్క జొన్న గింజలతో తయారు చేస్తారు. ఆ గింజలను వేడి చేసినప్పుడు దాని లోపల నీటిపై ఒత్తిడి ఏర్పడినప్పుడు గింజ లోపల ఉన్న పిండి పదార్థం పగిలి పాప్ కార్న్ గా మారుతుంది.
పాప్ కార్న్ లో పోషకాలు....
పాప్ కార్న్ మొక్క జొన్న నుంచి తయారౌతుంది కాబట్టి పాప్ కార్న్ లో లభించే చాలా పోషకాలు కూడా దీనిలోనే ఉంటాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. పాప్‌కార్న్‌లోని విటమిన్ శరీరంలో జీవక్రియను పెంచుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
బరువు నిర్వహణ..
పాప్ కార్న్ తిని చాలా ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. ఎందుకంటే.. పాప్ కార్న్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దాని వల్ల వాటిని తింటే బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. అయితే.. మీరు ప్లెయిన్ పాప్ కార్న్ మాత్రమే తినాలి. కేలరీలు తక్కువ కదా అని చీజ్, క్యారమెల్ పాప్ కార్న్ తింటే కుదరదు. వాటి వల్ల క్యాలరీల కౌంట్ పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
షుగర్ కంట్రోల్..
పాప్ కార్న్ ని షుగర్ పేషెంట్స్ చాలా హ్యాపీగా తినొచ్చు. వీటి వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం ఉండదు. అంతేకాదు.. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు.. పాప్‌కార్న్‌లో లభించే విటమిన్ సి మొత్తం చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే వీటిని తింటే అందమైన స్కిన్ టోన్ కూడా మన సొంతమౌతుంది.
ఎముకలను బలపరుస్తుంది
పాప్‌కార్న్‌లో ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు పెట్టినా ఎలాంటి నష్టం, భయం ఉండదు. అయితే... పాప్‌కార్న్ ఆరోగ్యకరమైన చిరుతిండి అయినప్పటికీ, జోడించిన నూనెలు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు,స్వీటెనర్లు శరీరానికి హానికరం. ప్లెయిన్ పాప్ కార్న్ తినడం మంచిది.