ఈ రోజుల్లో చాలా మంది అన్నం తక్కువగా తింటూ చపాతీ, జొన్న రొట్టెలను ఎక్కువగా తింటున్నారు. జొన్న రొట్టె కంటే గోధుమ చపాతీనే చాలా మంది రోజుకు ఒకటి రెండు పూటలా తింటున్నారు. ఎందుకంటే ఇవి బరువును తగ్గిస్తాయని, బరువు పెరగకుండా చేస్తాయని, పోషకాలు పుష్కలంగా అందుతాయని, శరీరం హెల్తీగా ఉంటుందని వీటిని తినడం అలవాటు చేసుకున్నారు.
కానీ గోధుమ రొట్టె కంటే బియ్యం పిండితో చేసిన రొట్టెనే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రొట్టె చాలా సులభంగా జీర్ణమవుతుంది.
అలాగే ఈ పిండితో చేసిన రొట్టె టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోటీని ఆకుపచ్చ కూరల్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో రైస్ పిండితో చేసిన రొట్టె తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బియ్యం పిండి రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
బియ్యం పిండిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బియ్యం పిండితో చేసిన రొట్టె తింటే మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రొట్టె మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బియ్యం పిండిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పిండి రొట్టెలు మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. మీరు ఒక నెల రోజుల పాటు బియ్యం పిండితో చేసిన రొట్టెను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్
బియ్యం పిండిలో ప్రోటీన్లతో పాటుగా, ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. అంటే ఇది డయాబెటీస్ పేషెంట్లకు మేలు చేస్తుంది. అదే గోధుమ పిండి చపాతీలను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బియ్యం పిండితో చేసిన రొట్టె మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం పిండిలో మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
బియ్యం పిండిలో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ రొట్టెను తింటే జుట్టు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
బియ్యం ప్పిండితో రొట్టెలను ఎలా తయారుచేయాలంటే?
2 కప్పుల బియ్యం పిండిలో 1/2 కప్పు నీళ్లు, 1/4 టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కలపండి. దీన్ని మెత్తని పిండిలా చేసుకోండి. ఈ పిండిని 10-15 నిముషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి ప్రతిదాన్ని రొట్టెను చేయండి. దీన్ని రెండు వైపులా నాన్ స్టిక్ పాన్ పై కాల్చండి. అంతే వేడి వేడి బియ్యం పిండి రొట్టె తయారైనట్టే. ఇలాగే వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది.