వంటగదిలో పచ్చిమిర్చీలను రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు. పచ్చి మిర్చీలు కేవలం కారం కోసమే కాదు, వంటకు రుచిని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. కేవలం చట్నీలకు మాత్రమే కాదూ.. కూరలకు కూడా ఇవి చాలా రుచిని తెస్తాయి. పచ్చి మిరపకాయలు చూడటానికి ఎంత ఫ్రెష్ గా, తాాజగా ఉన్నప్పుడు మనం కొని తెచ్చుకున్నా.. అవి చాలా తక్కువ సమయంలోనే ఎండుమిర్చిగా మారిపోతాయి. ఎక్కువ రోజులు ఉంటే అవి ఎండిపోవడం, కళ్లిపోవడం జరుగుతాయి. మరి.. ఇవి ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?