green banana
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
బాగా పండిన అరటిపండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే బాగా పండిన అరటిపండ్లను డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదంటారు. కానీ వీళ్లు పచ్చి అరటికాయను ఎంచక్కా తినొచ్చు. పచ్చి అరటిపండ్లలో పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
మలబద్దకాన్ని నయం చేస్తుంది
అరటికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే పచ్చి అరటికాయ ఉదర సంబంధ సమస్యలను, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది.
green banana
అల్సర్లను నయం చేస్తుంది.
నేటి కాలంలో చాలా మంది స్పైసీ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు. కానీ స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తింటే అల్సర్ వంటి వ్యాధుల బారిన పడతారు. అయితే పచ్చి అరటికాయలను తింటే అల్సర్లు తగ్గిపోతాయి.
గుండె జబ్బులను నివారిస్తుంది.
ఆకుపచ్చ అరటిపండ్లలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
బలమైన దంతాలు
రోజూ పచ్చి అరటికాయలను తింటే కాలక్రమేణా దంతాల సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు నయమవుతాయి. అలాగే దంతాలు కూడా బలంగా మారుతాయి. దంతాల సమస్యలున్నవారికి పచ్చి అరటికాయలు ప్రయోజనకరంగా ఉంటాయి.
శరీర బరువును తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ లను ఫాలో అవుతుంటారు. అయితే పచ్చి అరటికాయలు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును పచ్చి అరటికాయలు తొందరగా కడుపును నింపి ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.