ఏ గ్రేవీ కర్రీ చేసినా రుచి పెరగాలంటే... ఇది వేస్తే చాలు..!

First Published Jun 11, 2024, 2:33 PM IST

ఖర్బుజా గింజల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.  వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
 

సాయంత్రం అయితే చాలు.. ఇంట్లో పిల్లలకు స్నాక్స్ కావాలన్నా.. మనం ఏదైనా కర్రీ చేస్తే.. దాని రుచి అద్భుతంగా ఉండాలన్నా.. మనం చాలా తిప్పలు పడాల్సిన అవసరం లేదు. మనం వద్దు అని పారేసుకునే గింజలతో.. అద్భుతమైన స్నాక్స్.. అదిరిపోయే కర్రీలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఎండాకాలంలో ఎక్కువగా తినే పండ్లలో ఖర్బుజా కూడా ఒకటి. అయితే.. ఎక్కువ మంది ఖర్బుజా జ్యూస్ ఇష్టంగా తాగుతారు. కానీ.. అందులో ఉండే గింజలను మాత్రం పారేస్తూ ఉంటారు. కానీ.. ఖర్బుజా పండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.... దాని గింజలను తినడం వల్ల అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి.   అయితే... వాటిని ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్బుజా గింజల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.  వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఎంత ఆరోగ్యకరమైనవి అయినా.. కొన్నిసార్లు.. కొందరికి ఈ గింజలను నేరుగా తినాలంటే కష్టంగా అనిపించవచ్చు. అలాంటివారు..ఖర్బుజా కాయలోని గింజలను తీసి శుభ్రం చేయాలి. కాస్త ఆరిన తర్వాత ఎండలో ఎండనివ్వాలి. ఇప్పుడు వాటిని బేకింగ్ షీట్ మీద ఉంచి.. ఓవెన్ లో కాస్త క్రిస్పీ గా మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ లో అయినా వేయించవచ్చు. లైట్ గా ఉప్పు చల్లుకొని స్నాక్స్ గా తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

ఇక.. ఏదైనా గ్రేవీ కర్రీ కి మరింత రుచి పెంచడానికి కుడా ఈ గింజలను వాడొచ్చు. చాలా వరకు గ్రేవీ కర్రీలో రుచి పెంచడానికి జీడిపప్పు, గసగసాలు వాడతారు. కానీ వాటాికి బదులు... ఈ ఖర్బుజా గింజలను నీటిలో నానపెట్టి.. దానిని మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. దీనిని చికెన్, మటన్ లేదంటే పనీర్ , మఖానా కర్రీల్లోనూ వేసుకుంటే.. ఒకసారి వేసి చూడండి.. రుచి అదిరిపోతుంది. మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. 


సాధారణంగా మనం బ్రెడ్ తినాలంటే.. ఏవైనా సాస్ లను వాడతాం. లేదంటే.. పీనట్ బటర్ వాడతాం. అయితే.. ఈ సీడ్స్ తో కూడా ఖర్బుజాసీడ్ బటర్ తయారు చేయవచ్చు. ఈ గింజలను మంచిగా వేయించుకొని... ఆరనివ్వాలి. తర్వాత.. మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో.. మీకు నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న సీసాలో భద్రపరుచుకొని.. నచ్చినప్పుడు టోస్ట్ మీద అప్లై చేసుకొని తినవచ్చు.

Latest Videos

click me!