ఈ ఏడు గింజల తింటే... మీ షుగర్ తగ్గాల్సిందే..!

First Published Jun 8, 2024, 3:41 PM IST

ఈ షుగర్ వ్యాధిని  కంట్రోల్  చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది.  ఈ కింది గింజలను మీ డైట్ లో భాగం చేసుకుంటే..  షుగర్ కి చెక్ పెట్టవచ్చట. అదెలాగో చూద్దాం..
 

ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. చిన్న వయసు వారిలోనూ  షుగర్ రావడం కామన్ గా మారిపోయింది. ఇక ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే.. జీవితాంతం దానితో బాధపడాల్సిందే. మందులు మింగుతూనే ఉండాలి. నచ్చిన ఫుడ్స్ ఏవీ తినడానికి కూడా ఉండదు. 
 

షుగర్ వస్తే ... చాల రకాల స్వీట్స్ , పండ్లు తినాలని ఉన్నా.. తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే... ఈ షుగర్ వ్యాధిని  కంట్రోల్  చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది.  ఈ కింది గింజలను మీ డైట్ లో భాగం చేసుకుంటే..  షుగర్ కి చెక్ పెట్టవచ్చట. అదెలాగో చూద్దాం..
 

Latest Videos


Pomegranate

1. దానిమ్మ గింజలు..
 
దానిమ్మ గింజలతో షుగర్ కంట్రోల్ చేయవచ్చట.  యాంటీఆక్సిడెంట్లు ,  విటమిన్ సి పుష్కలంగా ఉన్న దానిమ్మ గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 

2. మెంతులు

ఫైబర్ పుష్కలంగా ఉండే మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. మెంతులు గింజల రూపంలో తీసుకోలేకపోయినా.. వాటిని నానపెట్టిన వాటర్ తాగడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ చేయవచ్చట.
 

3. ఫ్లాక్స్ సీడ్

ప్లాక్స్ సీడ్స్ ని అవిసె గింజలు అని కూడా అంటారు. వీటిలో ఫైబర్ కూడా ఉండి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

4. చియా విత్తనాలు

ఫైబర్ పుష్కలంగా ఉండే చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి మంచిది.

5. పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

6. గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజల్లో ఫైబర్ , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 

7. నువ్వులు

పీచు పుష్కలంగా ఉండే నువ్వులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మంచివి.
 

click me!