చంద్రబాబు తినే ఈ ఫుడ్ మీరు తింటే.. కలిగే లాభాలు ఇవే..!

First Published Jun 6, 2024, 12:44 PM IST

చంద్రబాబు అసలు.. తన ఫుడ్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటారు..? ఆ ఫుడ్ తింటే కలిగే లాభాలు కూడా చూద్దాం...
 

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.  మొన్నటి వరకు అధికారంలో ఉన్న  వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు వయసు అక్షరాలా 74 సంవత్సరాలు. అయినప్పటికీ.. ఆయన చాలా చురుకుగా ఉంటారు. ఈ వయసులోనూ ఆయన అంత చురుకుగా ఉంటున్నారు అంటే.. ఆయన ఫాలో అయ్యే ఆహారపు అలవాట్లే కారణం అని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
 

చంద్రబాబు అసలు.. తన ఫుడ్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటారు..? ఆ ఫుడ్ తింటే కలిగే లాభాలు కూడా చూద్దాం...

తన ఆహారపు అలవాట్ల గురించి ఆయనే స్వయంగా ఓసారి వివరించారు. తాను తినడం కోసం బతకను అని.. కేవలం బతకడం కోసమే తింటాను అని చెప్పారు. తీసుకునే ఆహారం కూడా చాలా సింపుల్ గా తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. అయితే...  తీసుకునే ఆహారం మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. అంటే... కొంచెం తీసుకున్నా దాని నుంచే ప్రోటీన్, న్యూట్రియంట్స్  అన్ని పోషకాలు ఉండేలా చూసుకుంటారట.
 

Latest Videos


ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆయన రెగ్యులర్ గా జొన్నతో చేసిన ఇడ్లీ తింటూ ఉంటారట.  లేదంటే ఓట్స్ తో చేసిన ఉప్మా లాంటివి, రెండు ఎగ్ వైట్స్ తీసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్, పండ్లు తింటారు.
 

ఇక మధ్యాహ్నం కూడా రాగి, సజ్జ, జొన్నలతో , కూరగాయలు కలిపి చేసిన ఫుడ్ సాయంత్రం స్నాక్స్ గా ఒక సూప్.. రాత్రి డిన్నర్ లో పాలు మాత్రమే తాగుతారట. ఆయన తీసుకునే ఆహారంలో.. ఒక దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.. అదే జొన్న ఇడ్లీ. సాధారణంగా మనం.. తెల్లగా , మల్లెపువ్వులా ఉండే ఇడ్లీ తింటూ ఉంటాం. కానీ.. ఈ జొన్న ఇడ్లీ తినడం వల్ల మన ఆరోగ్యం ఎలా మారుతుందో..? దాని వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..
 

జొన్న రవ్వలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సైతం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. అన్ని రకాల విటమిన్లు, మినర్స్, మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి.
 

జొన్న రవ్వను ఇడ్లీ రూపంలో తీసుకున్నా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  జీర్ణ వ్యవస్థ మెరుగుపడేలా.. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. డయాబెటిస్ వస్తుందనే భయం ఉండదు. క్యాన్సర్ లాంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.  అంతేకాదు.. జొన్న రవ్వ గుల్టెన్ ఫ్రీగా ఉంటుంది. కాస్త ఎక్కువ తీసుకున్నా ఏమీ కాదు.  ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. చంద్రబాబు తన డైట్ లో జొన్న ఇడ్లీని భాగం చేసుకున్నారు.
 

click me!