గ్యాస్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. హెవీగా తినడం, తిన్నది అరగకపోవడం, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి కారణాల వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అలాగే తిన్నతర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని కొన్ని సార్లు శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్ల కూడా జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అయితే కడుపు గ్యాస్, బెల్చింగ్, దుర్వాసన, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించుకోవడానికి మీ కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
రెండు పదార్థాలతో తయారుచేసిన టీ తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. అవేంటో కాదు సోంపు, అల్లం. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ రెండింటితో తయారుచేసిన టీ తాగితే మీ కడుపు ఆరోగ్యంగా, ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది.