మీకు రక్తం తక్కువగా ఉంటే వీటిని తినండి.. పెరుగుతుంది

First Published | May 6, 2023, 2:29 PM IST

పురుషులతో పోలిస్తే ఆడవారికే రక్తం తక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఒంట్లో రక్తం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల లోపం వల్ల వచ్చే సమస్యనే రక్తహీనత అంటారు. అంటే దీని వల్ల శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల అలసట, బలహీనత  వంటి సమస్యలు వస్తాయి. అయితే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. పురుషులతో పోలిస్తే మహిళలు, చిన్నారుల్లోనే ఇనుము లోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఒంట్లో రక్తం పెరిగేందుకు ఎలాంటి ఆహారాలను తినాలంటే? 
 

బీట్ రూట్ 

ఈ దుంపలల్లో ఐరన్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లోని చాలా పోషకాలు మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. రక్తం పెరిగేందుకు బీట్ రూట్ ను అలాగే లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. 


ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇనుము శోషణను ప్రోత్సహించడానికి సహాయపడుతాయి.
 

నువ్వులు

నువ్వుల్లో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్లు బి6, విటమిన్ ఇ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇనుము శోషణను ప్రోత్సహిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
 

Moringa Leaves

మునగాకులు

మునగాకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మునగాకులు శరీర శక్తి స్థాయిని పెంచుతాయి. అలసటను, బలహీనతను పోగొడుతాయి. మునగాకుల్లో ఉండే ఐరన్ బలహీనతను తగ్గిస్తుంది.

Image: Getty Images

గింజలు

పిస్తా, జీడిపప్పు, బాదం వంటి గింజలు ఇనుముకు మంచి వనరులు. 100 గ్రాముల పిస్తాపప్పులో 3.9 మిల్లీగ్రాముల ఐరన్, జీడిపప్పులో 6.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల బాదం పప్పులో 5.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. గింజల్లో ప్రోటీన్లు, మంచి కొవ్వులు, అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
 

Latest Videos

click me!