ఎండాకాలం వచ్చేసింది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయని.. ఆ ఎండ తట్టుకోలేక ఇబ్బందిగా అనిపించినా... ఈ కాలంలో వచ్చే మామిడి పండ్లు మాత్రం ఆ ఎండ వేడిని మర్చిపోయేలా చేస్తాయి.. ఎందుకంటే.. మ్యాంగో లవర్స్.. ఈ పండు తినడం కోసం సంవత్సర నుంచి ఎదురు చూస్తూ ఉంటారు.
Image: Getty Images
పండిన మామిడి తియ్యగా ఉంటుంది కాబట్టి.. తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. దాంట్లో చాలా విటమిన్స్, పోషకాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. కానీ.. పండు మామిడి కాదు.. పచ్చి మామిడి కాయ తింటే ఏమౌతుందో తెలుసా?
పచ్చి మామిడి కాయ శ్వాసకోశ సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. పచ్చి మామిడి కాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
raw mango
పచ్చి మామిడికాయలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. అంతేకాదు.. మంచి ఫైబర్ ఉంటుంది. మంచి గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది.. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
పచ్చి మామిడి కాయను తినడం వల్ల అందం కూడా పెరుగుతుంది. మామిడిలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ .. చర్మం మెరిసిపోయేలా చేయడంలో సహాయం చేస్తాయి. ఎక్కువ కాలం యంగ్ గా కనిపించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఓరల్ హెల్త్ మెరుగుపరచడంలోనూ పచ్చి మామిడి కీలక పాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు కనక ఈ పచ్చి మామిడి కాయను కనుక తీసుకుంటే... ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఈ పచ్చి మామిడి కాయలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మన ఆహారం మంచిగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి.. చిన్న మామిడి ముక్క మీ జీర్ణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
పచ్చి మామిడికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి... దీనిని తినడం వల్ల.. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి.. మీరు ప్రయత్నించవచ్చు.
అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేయడంలోనూ.. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలోనూ మామిడి కాయ సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారు పండు మామిడికి దూరంగా ఉన్నా... పచ్చి మామిడి తినవచ్చు.