శీతాకాలంలో ఆకలి మందగిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీనికోసం రోగ నిరోధకశక్తిని పెంపొందించే పండ్లను తీసుకోవాలి. నిజానికి శీతాకాలంలో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అలాంటి ఏడు అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే పండ్లు చూద్దాం..
undefined
కరోనా కారణంగా ఇమ్యూనిటీ మీద అందరికీ చాలా అవగాహన ఏర్పడింది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కషాయాలు, రకరకాల పానీయాలు, గ్రీన్ టీలు.. హెల్తీ డైట్ లు ఒక్కటేం ఖర్మ ఇన్ఫెక్షన్లను దూరం ఉంచడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
undefined
సీజన్ ఛేంజ్ ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఎండలు, వానలు తగ్గి చల్లటి వాతావరణం హాయిగానే ఉంది. కానీ దీనివెంటే జలుబు, జ్వరం, దగ్గు లాంటి వ్యాధులు పొంచి ఉన్నాయి. అందుకే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి. అదృష్టవశాత్తు ఈ చలికాలంలో ఎన్నో రకాల పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి.
undefined
పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండే పండు జామ. ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఆపిల్ కంటే ఎక్కువ ఆరోగ్యవంతమైనది. క్రంచీగా, తియ్యగా ఉండే జామలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధులతో ప్రభావవంతంగా పోరాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ లాంటివి ఉన్నవారికి ఎంతో మంచిది.
undefined
పియర్స్లేతాకుపచ్చ రంగులో ఉండే ఈ పండు ఎంతో మృదువుగా ఉంటుంది. జామకాయలాగే కనిపించే ఈ పండు జ్యూసీగా ఉండి.. తింటుంటే ఎంతో బాగుంటుంది. పిల్లలు, పెద్దలు సమానంగా ఇష్టపడే పండు ఉంది. మీ పేగులకు ఈ పండు ఎంతో మంచిది. దీంట్లో సి విటమిన్, ఈ విటమిన్, యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
undefined
ఆరెంజ్విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా దొరికే సిట్రస్ ఫ్రూట్ నారింజ. సీజనల్ వ్యాధులకు ఎంతో చక్కటి పరిష్కారం ఈ పండు. ఎన్నో రకాల మొండి, దీర్ఘకాల జబ్బులకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచడమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులకు దూరంగా కూడా ఉంచుతుంది.
undefined
ఆపిల్రోజుకో ఆపిల్ డాక్టర్ ను దూరంగా ఉంచుతుందనే విషయం తెలిసిందే. శరీరంలో ఇనఫ్లమేషన్ ను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఆపిల్ బాగా పనిచేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి, కె లు ఆపిల్ లో ఎక్కువగా ఉంటాయి.
undefined
మొసంబితీపి నిమ్మకాయ లేదా మొసంబి కూడా సిట్రస్ జాతికి చెందిందే. విటమిన్ సి ఎక్కువగా ఉండే మొసంబీ జ్యూస్ ఎంతో ఆరోగ్యవంతం. మొసంబి జ్యూస్ ను వడకట్టకుండా తాగడం వల్ల దాంట్లోని ఫైబర్ ను కోల్పోకుండా ఉంటారు.
undefined
దానిమ్మఎర్రటి ముత్యాల్లాంటి గింజలతో ఉండే దానిమ్మలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఫ్రీ రాడికల్స్ తో బాగా పోరాడుతుంది. రక్తాన్నిి పెంచి, బీపీ, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
undefined
ప్లమ్ లేద అల్బుకారాఅల్బుకారా లేదా ప్లమ్ లో పుష్కలంగా వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు కూడా అల్బుకారాలో నిండుగా ఉంటాయి.
undefined
నేటి రోజుల్లో ఈ పండ్లు అన్ని సీజన్లలో కూడా దొరుకుతున్నాయి. కాబట్ట వీటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల సంవత్సరం పొడవుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
undefined