కాలం గడిచేకొద్దీ చదువు పూర్తవ్వగానే టోపీని గాల్లోకి విసరడం కేవలం ఒక సరదాగా, సంప్రదాయంగా మారింది. ఎన్నో సంవత్సరాల కష్టానికి, చదువుకు, పట్టుదలకు గుర్తుగా విద్యార్థులు ఈ క్షణాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. టోపీ గాల్లోకి ఎగరడం అంటే ఒక విద్యా దశ ముగిసి, ఉద్యోగం, కొత్త అవకాశాలు, కొత్త లక్ష్యాలతో జీవితంలో మరో దశ ప్రారంభమవుతోందనే అర్థం. అందుకే కాన్వొకేషన్ వేడుకల్లో అలా గాల్లోకి టోపీలు విసరడం కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. డిగ్రీ వేడుకల్లో ధరించే నల్లటి గౌన్లు, చతురస్రాకార టోపీలకు కూడా చాలా పాత చరిత్ర ఉంది. యూరప్‌లోని పాత విశ్వవిద్యాలయాల కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చలి నుంచి రక్షణ కోసం పొడవైన గౌన్లు, ప్రత్యేకమైన టోపీలు ధరించేవారు. తర్వాత ఇవి విద్య, జ్ఞానం, గౌరవానికి చిహ్నాలుగా మారాయి. ఆ తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో కాన్వొకేషన్ వేడుకల్లో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.