Blue River: మనదేశంలో ఎన్న నదులు ఉన్నాయి. కానీ కొన్ని నదులు మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ బ్లూ రివర్ ఒకటి. ఇందులోని నీరు చాలా నీలం రంగులో ఉంటాయి. అందుకే ఈ నదిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.
భారతదేశంలో వందల కొద్దీ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎంతో ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో మేఘాలయలోని లుఖా నది ఒకటి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ కొండల్లో ప్రవహించే ఈ నదిని "బ్లూ రివర్" అని పిలుస్తుంటారు. సాధారణంగా నదుల్లో నీరు సహజ రంగులోనో లేదా మట్టి కొట్టుకువచ్చి కాస్త గోధుమ రంగులోనో కనిపిస్తుంది. కానీ ఈ లుఖా నది మాత్రం శీతాకాలం రాగానే గాఢ నీలిరంగులోకి మారిపోతుంది. కొండలు, పచ్చని అడవుల నడుమ ప్రవహించే ఈ నీలి నదిని చూడటానికి దేశవ్యాప్తంగా పర్యాటకులు ఎగబడుతుంటారు. మొదటిసారి చూసిన ఎవరికైనా ఇది ప్రకృతి చేసిన మాయలా అనిపిస్తుంది.
23
నీరు నీలం రంగులోకి ఎందుకు మారుతుంది?
ఈ నది నీలిరంగు వెనుక ఉన్న కొన్ని నిజాలు ఉన్నాయి. చాలామంది ఇది కేవలం ప్రకృతి అందం అనుకుంటారు కానీ, దీని వెనుక రసాయన చర్యలు కూడా ఉన్నాయి. స్థానిక కొండల్లో బొగ్గు, సున్నపురాయి గనులు ఎక్కువగా ఉండటం వల్ల వర్షాకాలం తర్వాత నది నీటిలో ఆమ్ల స్థాయిలు మారతాయి. ఫలితంగా నీటిలోని ఖనిజాలు, ప్రత్యేకించి అల్యూమినియం వంటివి అవక్షేపంగా మారి సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. ఆ కాంతి ప్రతిఫలనం వల్లే పైనుంచి చూస్తే నీరు మెరిసే నీలి రంగులో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ మార్పు వల్ల నదిలోని చేపలు, జలచరాలు చనిపోయేవి. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రత్యేక పద్ధతుల వల్ల నీటి కాలుష్యం తగ్గి, జీవవైవిధ్యం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది.
33
నది పక్కనే.. అలా ఉండిపోతారు
లుఖా నది పర్యాటక రంగంలో మేఘాలయకు ఒక ముఖ్య ఆకర్షణగా మారింది. డార్కీ, షిల్లాంగ్ వచ్చే ప్రయాణికులు ఈ నది అందాలను కళ్లారా చూసి సెల్ఫీలు దిగుతారు. నది చుట్టూ ఉండే ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులను విశేషంగా కట్టిపడేస్తున్నాయి. వింత రంగుతో కనువిందు చేసే ఈ నది... పర్యాటకంగా అందాన్నిస్తుంది. నీటిలో ఎవరో నీలం రంగు కలిపినట్టే ఈ నది కనిపిస్తుంది.