Old Iron Scrap: ఇంటింటికి తిరిగి పాత ఇనుప సామాన్లు కొనేవాళ్లు వాటితో ఏం చేస్తారో తెలుసా?

Published : Nov 05, 2026, 01:46 PM IST

Old Iron Scrap: మన ఇంట్లో పాత ఇనుప సామాన్లు, విరిగిపోయిన కుర్చీలు, తుప్పుపట్టిన వస్తువులు ఉంటే ఏం చేస్తాం? ఇంట్లో ఎందుకు దండగని పాత సామాన్లు కొనేవారికి అమ్మేస్తాం. మన దగ్గర తక్కువ ధరకు ఈ పాత వస్తువులు కొనుగోలు చేసేవారు వాటితో ఏం చేస్తారో తెలుసా?

PREV
15
పాత ఇనుప సామాన్లతో ఏం చేస్తారు?

మన ఇళ్లలో వాడకుండా పక్కన పడేసిన పాత ఇనుప వస్తువులు, తుప్పుపట్టిన సామాన్లు, విరిగిపోయిన కుర్చీలు, పాత సైకిళ్లు, ఇనుప బకెట్లు, పాత పాత్రలు ఇలా ఎన్నో వస్తువులు ఉంటాయి. ఇంట్లో స్థలం ఆక్రమిస్తున్నాయని, వాటితో ఉపయోగం లేదని చాలామంది వాటిని బయట పడేస్తుంటారు. అయితే మనం పనికిరావని వదిలేసే ఈ వస్తువులనే కొంతమంది వ్యాపారులు ఇంటింటికి తిరిగి కొనుగోలు చేస్తుంటారు. పాత ఇనుప సామాన్లకు ఉల్లిపాయలు, డబ్బులు ఇస్తామంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అసలు వాటితో వాళ్లు ఏం చేస్తారు? వాటిని ఎక్కడికి తీసుకెళ్తారు? వాటి ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

25
పాత వస్తువులను కొనుగోలు చేసి..

సాధారణంగా పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతుంటారు. ఇళ్లలో ఉపయోగించని ఇనుప వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. పాత ఇనుప కడ్డీలు, తలుపులు, కిటికీలు, ఇనుప గ్రిల్స్, పాత మంచాలు, కుర్చీలు, సైకిళ్లు, మోటార్ విడిభాగాలు, పాడైపోయిన వ్యవసాయ పనిముట్లు ఇలా రకరకాల వస్తువులను సేకరిస్తుంటారు. కొన్నిసార్లు ఇనుముతో పాటు పాత అల్యూమినియం పాత్రలు, రాగి తీగలు, ఇత్తడి వస్తువులు, పాత ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. వీటిలో ఒక్కో లోహానికి ఒక్కో ధర ఉంటుంది. అందుకే వస్తువును పరిశీలించి, దాని బరువు, లోహం రకం, నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు.

35
స్క్రాప్ ని డివైడ్ చేయడం

వ్యాపారులు కొనుగోలు చేసిన వస్తువులను వెంటనే అమ్మేయరు. ముందుగా వాటిని తమ వద్ద ఉన్న చిన్న గోదాములు లేదా స్క్రాప్ దుకాణాలకు తీసుకెళ్తారు. అక్కడ సేకరించిన సామాన్లను రకరకాలుగా వేరు చేస్తారు. ఇనుమును ఒకచోట, అల్యూమినియంను మరోచోట, రాగిని ఇంకోచోట పెడతారు. ఇనుములో కూడా మందపాటి ఇనుప ముక్కలు, పలుచటి షీట్లు, తుప్పుపట్టిన వస్తువులు, యంత్రాల విడిభాగాలు అంటూ డివైడ్ చేస్తారు.

45
కొత్త వస్తువు రూపంలో..

ఈ చిన్న చిన్న వ్యాపారులు సేకరించిన పాత ఇనుప సామాన్లను పెద్ద స్క్రాప్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వీరు తమ వద్దకు వచ్చిన వస్తువులను బాగా పరిశీలించి బరువు ప్రకారం కొనుగోలు చేస్తారు.పెద్ద మొత్తంలో సేకరించిన ఇనుమును రీసైక్లింగ్ పరిశ్రమలకు పంపిస్తారు. అక్కడ ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో ఇనుమును చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తారు. అనంతరం వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, మలినాలను తొలగించి తిరిగి కొత్త ఇనుము లేదా ఉక్కు తయారీకి ఉపయోగిస్తారు. ఈ విధంగా మనం పనికిరాదని భావించిన పాత ఇనుప వస్తువులు మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి వస్తాయి.

55
ఉపాధి మార్గంగా..

ప్రస్తుతం ఈ వ్యాపారం ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటింటికి తిరిగి పాత సామాన్లు సేకరించే వ్యక్తుల నుంచి చిన్న స్క్రాప్ దుకాణాల యజమానులు, సరుకు రవాణా చేసే డ్రైవర్లు, గోదాముల్లో పనిచేసే కార్మికులు, రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల వరకు ఎంతోమంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పెద్దగా పెట్టుబడి లేకుండానే చిన్న స్థాయిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అందుకే చాలామంది దీన్ని స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories