వస్తువులే కాదు.. నగదు కూడా బహుమతిగా!
వెడ్డింగ్ రిజిస్ట్రీలో వస్తువులే ఉండాలనే నియమం లేదు. కొన్ని జంటలు డబ్బు, హనీమూన్ ఖర్చులు, కొత్త ఇంటి ఏర్పాట్ల కోసం డబ్బు..ఇలా సమకూర్చే అవకాశాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అతిథులు తమకు అనుకూలమైన మొత్తాన్ని ఎంచుకుని బహుమతిగా ఇవ్వవచ్చు.
అయితే, అమెరికాలో ప్రతి పెళ్లిలోనూ ఇదే విధానం పాటిస్తారని చెప్పలేం. కొందరు జంటలు రిజిస్ట్రీని ఉపయోగిస్తే, మరికొందరు సంప్రదాయ బహుమతులు లేదా నగదును స్వీకరిస్తారు. జంటల అభిరుచులు, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతాలను బట్టి పద్ధతులు మారుతుంటాయి.
బహుమతుల ఎంపికలో టెన్షన్ తగ్గించే విధానం
వెడ్డింగ్ రిజిస్ట్రీ వల్ల బహుమతి కొనేవారికి ఏది ఎంచుకోవాలనే ఆలోచన తగ్గుతుంది. కొత్త జంటకు అవసరమైన వస్తువులు అందే అవకాశం పెరుగుతుంది. అలాగే ఒకే రకమైన బహుమతులు పదేపదే రావడాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మనదేశంలోనూ పెళ్లి బహుమతుల విషయంలో ఆచారాలు మారుతున్నాయి. కొందరు జంటలు నగదు లేదా తమకు అవసరమైన వస్తువులనే బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నారు.