Tips and Tricks : క్యాలిక్యులేటర్‌లో GT, CE, MU బటన్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసా?

Published : Sep 10, 2026, 07:38 PM ISTUpdated : Sep 10, 2026, 08:01 PM IST

క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు మనం ఎక్కువగా నెంబర్లను లేదా +, -, ×, ÷, C వంటి బటన్లనే వాడతాం. కానీ వీటితో పాటు మనకు తెలియని చాలా ఉపయోగపడే బటన్లు ఇందులో ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
క్యాలిక్యులేటర్ టిప్స్ ఆండ్ ట్రిక్

Calculator Tips and Tricks : ఒకప్పుడు పెద్దపెద్ద షాపులు, ఎక్కువమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపేవారు మాత్రమే క్యాలిక్యులేటర్ వాడేవారు. ఇక బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే సెల్ ఫోన్స్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాక ప్రతిఒక్కరు క్యాలిక్యులేటర్ వాడటం ప్రారంభించారు… చిన్నచిన్న నోటి లెక్కలకు కూడా వీటినే వాడేస్తున్నారు. చివరికి ఈ తరంవారు క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయలేని పరిస్థితి వచ్చింది.

అయితే క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు మనం అంకెలతో పాటు +, -, ×, ÷, C వంటి బటన్లనే ఎక్కువగా వాడతాం. క్యాలిక్యులేటర్ లోని కొన్ని బటన్స్ ఎందుకు వాడతారో కూడా చాలామందికి తెలియదు.. అలాంటివే GT, CE, MU బటన్లు. వీటిగురించి తెలియక వాడటంలేరుగానీ తెలిస్తే తప్పకుండా ఉపయోగిస్తారు. వీటితో రోజువారీ లెక్కలు మరింత ఈజీగా, వేగంగా చేయొచ్చు. మరి ఈ బటన్లు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
1. GT బటన్‌ ఎప్పుడు వాడాలి?

GT అంటే గ్రాండ్ టోటల్ అని అర్థం. వేర్వేరుగా చేసిన లెక్కలన్నింటినీ కలిపి మొత్తం చెప్పడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు ₹2.5 చొప్పున 8 షాంపూలు (₹20)… ₹27 చొప్పున 4 సబ్బులు (₹108)… కిలో ₹27 చొప్పున 12 కేజీల పిండి (₹324) కొన్నారు అనుకుందాం. ఈ లెక్కలన్నీ చేశాక GT బటన్ నొక్కితే మొత్తం కలిపి ₹452 అని చూపిస్తుంది. అంటే ₹20 + ₹108 + ₹324 = ₹452. ఎక్కువ లెక్కలు చేసేవారికి ఇది చాలా ఉపయోగం.

35
2. CE బటన్ ఎలా వాడాలి?

క్యాలిక్యులేటర్ లో లెక్కలు చేసేటప్పుడు పొరపాటున తప్పు నంబర్ టైప్ చేయడం సహజం. ఇలాంటప్పుడు చాలామంది AC (All Clear) బటన్ నొక్కుతారు… దీంతో ఆ ఒక్క అంకే మాత్రమే కాదు మొత్తం లెక్క చెరిగిపోతుంది. ఇక్కడే CE (క్లియర్ ఎంట్రీ) బటన్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 235 + 166 + 286 + 734 అని టైప్ చేశారనుకుందాం… కానీ చివరి నంబర్ 734 బదులు 374 అని వేయాలి… అప్పుడు మొత్తం లెక్క మళ్లీ చేయకుండా CE నొక్కితే చాలు. ఇది మీరు చివరగా ఎంటర్ చేసిన నంబర్‌ను మాత్రమే తీసేస్తుంది. ఆ తర్వాత సరైన నంబర్ 374 ఎంటర్ చేసి లెక్క పూర్తి చేయొచ్చు.

45
3. MU బటన్ ఎప్పుడు వాడాలి?

వ్యాపారులకు, వస్తువుల అమ్మకం ధరను లెక్కించేవారికి MU (మార్క్-అప్) బటన్ బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు ఒక వస్తువును ₹150కి కొన్నారు. దానిపై 20% మార్క్-అప్ జోడించి ధర నిర్ణయించాలంటే MU బటన్‌తో సులభంగా లెక్కించవచ్చు. అయితే మార్క్-అప్, ప్రాఫిట్ మార్జిన్ రెండూ ఒకటి కాదు. ₹150 మీద 20% మార్క్-అప్ అంటే అమ్మకం ధర ₹180 అవుతుంది. కానీ ₹150 ఖర్చుపై 20% లాభం కావాలంటే అమ్మకం ధర ₹187.50 ఉండాలి. కాబట్టి MU బటన్ వాడే ముందు మీ క్యాలిక్యులేటర్ మోడల్‌ను బట్టి దాని పనితీరును గమనించాలి.

55
ఇకపై క్యాలిక్యులేటర్ ఇలా వాడండి

మనం ఏళ్లుగా క్యాలిక్యులేటర్ వాడుతున్నా అందులోని చాలా బటన్ల పూర్తి ఉపయోగం మనకు తెలియదు. ఇప్పుడు GT, CE, MU బటన్ల గురించి తెలుసుకున్నారు… కాబట్టి ప్రత్యేక లెక్కల సమయంలో వీటిని ఉపయోగించి మీ సమయాన్ని ఆదా చేసుకొండి. ఈసాారి క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు కేవలం +, -, ×, ÷ బటన్లకే పరిమితం కాకుండా, ఇతర బటన్ల పనితీరును కూడా తెలుసుకోండి… మరింత ఈజీగా లెక్కలు చేసుకొండి.

Read more Photos on
click me!

Recommended Stories