Smart Toothbrush: వామ్మో బ్రష్ ధర రూ.47 వేలా? నోట్లో ఏం జరుగుతుందో లైవ్‌గా చూడొచ్చు

Published : Oct 23, 2026, 12:34 PM IST

Smart Toothbrush: ఉదయం లేవగానే బద్ధకం..పళ్లు తోముకునేటప్పుడూ అదే తీరు. దీంతో పళ్ల మధ్య క్రిములు పేరుకుపోతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ టూత్ బ్రష్ వచ్చేస్తోంది. నోట్లో ఏం జరుగుతుందో చూపించే ఈ బ్రష్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే!

PREV
14
బద్ధకమే లాభం

ఉదయం నిద్రలేవగానే బద్ధకం.. పళ్లు తోముకోవాలన్నా బద్ధకం.. ఇక బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య ఏమైనా మిగిలిపోయాయా అని చూసుకోవడం మరో పని. రోజువారీ పనులను సులభం చేసుకోవడానికి టెక్నాలజీపై ఆధారపడుతున్న మనుషులకు ఇప్పుడు మరో గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. నోట్లో ఏం జరుగుతుందో కెమెరాతో చూపిస్తూ, పళ్లను శుభ్రం చేసుకోవడంలో సాయం చేసే స్మార్ట్ టూత్ బ్రష్ ఇది. అయితే దీని ధర తెలిస్తే మాత్రం కళ్లు తిరగాల్సిందే. పళ్లు తోముకునే పనిని మరింత సులభం చేసే ఈ బ్రష్ కోసం దాదాపు రూ.47 వేలు ఖర్చు చేయాలా? అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

24
పళ్ల మధ్య ఏం జరుగుతుందో కెమెరాతో చూడొచ్చు!

డైసన్ రూపొందించిన CameraJet స్మార్ట్ టూత్ బ్రష్ సాధారణ బ్రష్‌లా పళ్లు శుభ్రం చేయడం ఒక్కట కాదు. ఇందులో 100,000 పిక్సెల్ మాక్రో కెమెరా, ఏఐ ఆధారిత సాంకేతికత ఉన్నాయి. ఇవి పళ్ల మధ్య ఖాళీలను గుర్తించి, అవసరమైన చోట మౌత్‌వాష్‌ను జెట్ రూపంలో పంపేలా పనిచేస్తాయి. MyDyson యాప్ ద్వారా నోటిలోని దృశ్యాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. బ్రషింగ్‌లో ఏయే ప్రాంతాలను సరిగ్గా శుభ్రం చేయడం లేదో తెలుసుకునేందుకు కూడా ఈ యాప్ చెబుతుంది.

34
ధర తెలిస్తే మాత్రం షాక్!

ఈ బ్రష్‌లోని టెక్నాలజీ ఆసక్తికరంగానే ఉన్నా.. దాని ధరే చాలామందికి పెద్ద షాక్. అమెరికాలో దీని ధర 499.99 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.47 వేలు. ఇంకా జీఎస్టీ, దిగుమతి ఖర్చులు చూసుకుంటే ఇంకా రూ.50వేలు దాటే అవకాశం ఉంది.

ఒక్కసారి ఆలోచించండి.. మామూలు బ్రష్‌తో పళ్లు తోముకోవడానికే కష్టంగా భావించే మనుషులు, దాని కోసం దాదాపు రూ.47 వేలు ఖర్చు చేయడానికి సిద్ధపడతారా? ఇంత ఖరీదైన గ్యాడ్జెట్ కొనడం కంటే రోజూ సరిగ్గా బ్రష్ చేయడం, పళ్ల మధ్య శుభ్రతపై శ్రద్ధ పెట్టడం బెటర్ కదా అని చాలా మంది అంటున్నారు.

44
టెక్నాలజీ సౌకర్యమా.. మరింత బద్ధకమా?

మనిషి పనులను సులభం చేయడమే టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. కానీ ప్రతి చిన్న పనికీ గ్యాడ్జెట్లపై ఆధారపడితే మన అలవాట్లు ఎలా మారతాయన్నది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు పళ్లు తోముకోవడంలోనూ కెమెరా, ఏఐ సాయం అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ బ్రష్ నిజంగా ఎంత ఉపయోగకరమో, దాని ధరకు తగిన ప్రయోజనం అందిస్తుందో అనేది వినియోగదారులు ఆలోచించాల్సిన అంశం. బద్ధకాన్ని తగ్గించేందుకు వచ్చిన టెక్నాలజీ.. మనిషి సొంతంగా చేయాల్సిన పనులను కూడా గ్యాడ్జెట్లకు అప్పగించే పరిస్థితి తీసుకొస్తుందా?

Read more Photos on
click me!

Recommended Stories