Highest Paying Jobs: మనదేశంలో అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇవే.. డాక్టర్, ఇంజినీర్ మాత్రం కావు

Published : Oct 21, 2026, 09:40 AM IST

Highest Paying Jobs: ఇండియాలో అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాలు అనగానే అందరికీ డాక్టర్, ఇంజనీర్ ఉద్యోగాలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు పది రెట్లు ఎక్కువ జీతం ఇచ్చే కొత్త కెరీర్ ఆప్షన్స్ వచ్చాయి. అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాల గురించి తెలుసుకోండి.

PREV
14
ఇండియాలో అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలు

ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా సీఏ చదివితేనే ఎక్కువ జీతం వస్తుందని అనుకుంటాని. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లే కాదు.. వాళ్ల కంటే ఎక్కువ సంపాదించే ఎన్నో కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాల గురించే ఇక్కడి మేము ఇచ్చాము.

డేటా సైంటిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మొబైల్ డెవలపర్, ప్రొడక్ట్ మేనేజర్, డేటా అనలిటిక్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది. జీతాలు కూడా లక్షల్లో ఉంటాయి. ఏడాదికి ప్యాకేజీలు వీళ్లకి కోటి రూపాయల వరకు కూడా చేరుకుంటాయి.

24
డేటా సైంటిస్ట్

ఈ డిజిటల్ యుగంలో డేటాకు డిమాండ్ పెరిగిపోయింది. ఒక సాధారణ ఇంజనీర్ 5 ఏళ్ల అనుభవంతో రూ.8 నుంచి 12 లక్షలు సంపాదిస్తే.. అదే 5 ఏళ్ల అనుభవం ఉన్న డేటా సైంటిస్ట్ ఏకంగా రూ.75 లక్షల వరకు ప్యాకేజీ అందుకుంటాడు. రాబోయే రోజుల్లో వీరికి డిమాండ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

34
సొల్యూషన్ ఆర్కిటెక్ట్

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి ఏకంగా ఏడాదికి రూ.80 లక్షల వరకు జీతం వస్తుంది. బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ ప్లాన్స్ రెడీ చేయడమే ఈ ఉద్యోగం. కంపెనీల ఎదుగుదలలో వీరిదే ముఖ్యపాత్ర. ఇండియాలోని పెద్ద టెక్ కంపెనీలన్నీ ఇలాంటి నిపుణుల కోసం వెతుకుతున్నాయి.

మొబైల్ డెవలపర్

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. మొబైల్ లేకుండా ఏ పనీ జరగదు. అందుకే మొబైల్ డెవలపర్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. 4 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న మొబైల్ డెవలపర్లు రూ.50 నుంచి 60 లక్షల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నారు. ఆండ్రాయిడ్, యాప్ డెవలపర్లకు రోజురోజుకూ అవకాశాలు పెరుగుతున్నాయి.

44
డేటా అనలిటిక్స్

4 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొడక్ట్ మేనేజర్లకు రూ.15 నుంచి 40 లక్షల వరకు జీతం వస్తుంది. స్కిల్స్ పెరిగే కొద్దీ ప్యాకేజీ కూడా పెరుగుతుంది. అలాగే 5 ఏళ్ల అనుభవం ఉన్న డేటా అనలిటిక్స్ మేనేజర్లు రూ.40 నుంచి 60 లక్షల వరకు సులభంగా సంపాదిస్తారు. కంపెనీ డేటాను మేనేజ్ చేస్తూ బిజినెస్ పెంచడం వీరి బాధ్యత.

Read more Photos on
click me!

Recommended Stories