Winter Snake: శీతాకాలంలో పాములు ఎందుకు బయటకు వస్తాయి? మీ ఇంటి చుట్టూ ఏ 5 రకాల పాములు తిరుగుతాయి? వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే పాములు బొరియల నుంచి బయటకు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. ఎండ వేడిని తట్టుకోలేక పాములు ఇళ్లలోకి చొరబడి చల్లదనాన్ని వెతుకుతాయని అనుకుంటారు. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు. చలికాలం లేదా శీతాకాలంలో కూడా పాములు విశ్రాంతి తీసుకోవడం కోసం వెచ్చని ప్రదేశాలను వెతుకుతూ తమ మాణాలను వదిలి బయటకు వస్తాయి. మీ ఇంటిలోని మూలలు, విరగ్గొట్టిన కట్టెల కుప్పలు వంటి అనేక ప్రాంతాల్లో ఈ పాములు సులభంగా దాక్కుంటాయి. అందువల్ల ఈ కాలంలో కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
26
మొదటి ప్రమాదకరమైన పాము: నాగుపాము
ఈ జాబితాలో మొదటిది ఎంతో ప్రమాదకరమైన నాగుపాము ఉంది. ఈ పాములు సాధారణంగా ఎలుకల చేసిన బొరియలు, చెదపుట్టలు, రాళ్ల కుప్పల లోపల సురక్షితంగా దాక్కుంటాయి. ఇవి అత్యంత విషపూరితమైనవిగా గుర్తింపు పొందాయి. సాధారణంగా ఇవి మనుషులను చూస్తే వాటంతట అవే దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. అయితే, అకస్మాత్తుగా ఇవి మనుషుల కంట పడితే మాత్రం అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి మీ ఇళ్ల చుట్టూ ఇలాంటి ప్రదేశాలు ఉంటే తక్షణమే శుభ్రం చేసుకోవడం మంచిది.
36
అత్యంత ప్రమాదకరమైన కట్ల పాము
చలికాలంలో ఇండ్ల పక్కన ఎక్కువగా కనిపించే పాములలో కట్లపాము ఒకటి. ఈ పాములను ఎక్కువగా రాత్రి సమయాలలోనే మనం చూడగలం. ఇవి చూడటానికి చిన్నవిగా, చాలా సన్నగా ఉంటాయి. అయినప్పటికీ, ఇవి అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. ఇవి కాటేస్తే కొన్ని సార్లు నొప్పి కూడా తెలియదు. ఇంట్లో సామగ్రి పెట్టిన గదులు, నేలపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు లేదా పగుళ్లు వంటి ఇళ్లలోని చీకటి మూలల్లోకి ఇవి చాలా సులభంగా దూరిపోగలవు. ఇంటి పరిసరాలలో రాత్రి పూట తిరిగేటప్పుడు లైట్లు వేయడం మర్చిపోకండి.
ఈ రకమైన పాములను మనం సాధారణంగా పచ్చటి మేటలు, వ్యవసాయ భూములు, చిన్న పొదల ప్రాంతాలలో ఎక్కువగా చూడవచ్చు. దీని శరీరం రంగు కారణంగా ఇలాంటి ప్రదేశాలలో వీటిని సులభంగా గుర్తించడం చాలా కష్టం. అందువల్ల మీరు నడిచేటప్పుడు లేదా పొలాలలో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. దీని కాటు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చి ప్రాణాలు తీస్తుంది.
56
చిన్నదైనా పెద్ద ముప్పు కలిగించే సర్ప పింజరి (పెంజరు పాము)
ఇది పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. పొడిగా ఉండే ప్రాంతాలు, ఇసుక ఎక్కువగా ఉన్న నేలలు, రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశాలు అంటే ఈ పాముకు చాలా ఇష్టం. రాళ్ళు, పెద్ద చెక్క ముక్కలు లేదా పడి ఉన్న చెత్తాచెదారం కింద ఇవి దాక్కుంటాయి. ఇళ్ల వెనుక భాగంలో వ్యర్థాలు ఉంటే ఇవి అక్కడ చేరే అవకాశం ఉంది.
66
జెర్రిపోతు
పాములన్నింటిలోనూ ఇది చాలా మంచిదని గుర్తింపు ఉంది. జెర్రిపోతు పాముకు ఎలాంటి విషం ఉండదు. మన ఇళ్లు, పూదోటలు, వ్యవసాయ పొలాల చుట్టూ సాధారణంగా ఈ పాము తిరుగుతుంటుంది. కొన్నిసార్లు ఇవి ఇళ్ల పైకప్పులపైకి కూడా ఎక్కిపోవడం మనం చూడవచ్చు. ఇవి మన ఇంట్లో, చుట్టూ తిరిగే ఎలుకలను వేటాడి తింటాయి. అందువల్ల ఇవి మనుషులకు ఎటువంటి హాని చేయకపోగా, ఎలుకలను నివారించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనుషులను చూడగానే చాలా వేగంగా వెళ్లిపోతాయి.