Salary Hike : జీతం పెరిగినా నెల చివర్లో ఆర్థిక కష్టాలు తప్పడంలేదా? చేతిలో డబ్బు నిలవాలంటే ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు

Published : Jul 28, 2026, 10:57 AM IST

ప్రతి ఏటా జీతం పెరిగినా నెల చివరికి వచ్చేసరికి చాలామంది చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం తక్కువ జీతం కాదు ఆర్థిక అలవాట్లు. డబ్బు చేతిలో నిలవాలంటే ఈ 5 తప్పులను వెంటనే ఆపేయాలి.

PREV
15
మీ శాలరీ పెరిగిందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మీ జీతం పెరిగిందంటే (Salary Hike) అది ఏళ్ల తరబడి పడిన కష్టానికి గుర్తింపు, ఫలితం దక్కిందన్నమాట. నెలల తరబడి బడ్జెట్ వేసుకుని, ఖర్చులు తగ్గించుకున్న తర్వాత చేతికి కాస్త ఎక్కువ డబ్బు రావడం పెద్ద రిలీఫ్. ఈ టైంలో కొత్త కారు, ఫోన్ కొనాలనిపిస్తుంది... ఇలా ఆదాయం పెరిగినప్పుడు చాలామంది ఖర్చులను కూడా పెంచేస్తారు. ఏడాది తర్వాత చూస్తే డబ్బు ఎందుకు మిగల్లేదని ఆశ్చర్యపోతారు. మీకు ఇటీవల జీతం పెరిగిందా..? అయితే మీ చేతిలో డబ్బులు నిలవాలంటే అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
పెరిగిన శాలరీని తెలివిగా వాడుకొండి

మీ జీతం రూ.15,000 పెరిగిందని అనుకుందాం... అంటే నెలానెలా మీ శాలరీలో అదనంగా రూ.15 వేలు వస్తాయి. అయితే చాలామంది ఇలా పెరిగిన శాలరీని కూడా ఎక్కువ ఇంటి అద్దె, బయట తిండి, షాపింగ్ లేదా సబ్‌స్క్రిప్షన్‌లకు సులభంగా ఖర్చు చేస్తుంటారు. కొద్దికాలానికే పాత జీతం సమయంలో ఉన్న ఆర్థిక ఇబ్బందే మళ్లీ వస్తుంది.

శాలరీ పెరగ్గానే ఖర్చులను ఒకేసారి పెంచే బదులు, పెరిగిన మొత్తాన్ని సింపుల్ గా విడగొట్టండి. అంటే మీ శాలరీ పెరగలేదని భావించాలి… అదనంగా వచ్చినదాంట్లో కొంత ఇన్వెస్ట్ చేయండి, మరికొంత ఎమర్జెన్సీ ఫండ్‌కు మార్చండి. మిగిలినదాన్ని మీ అవసరాలకు వాడుకోండి. ఇలా చేస్తే భవిష్యత్తును దెబ్బతీయకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

35
లగ్జరీ వద్దు.. పొదుపే ముద్దు

జీతం పెరిగినప్పుడు ఇల్లు, రిటైర్మెంట్ ఫండ్, పిల్లల చదువుల కోసం డబ్బు ఆదా చేయడం సులభం. కానీ చాలామంది పెరిగిన డబ్బును రోజువారీ ఖర్చులకే వాడేసి, ఈ లక్ష్యాలను వాయిదా వేస్తుంటారు. దీన్ని నివారించడానికి సులభమైన మార్గం జీతం పెరగగానే మీ SIPలు లేదా ఇతర పెట్టుబడులను పెంచడమే. మీరు డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టక ముందే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే, తర్వాత ఆ డబ్బు లేదనే ఫీలింగ్ ఉండదు.

45
ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి

జీతం పెరిగినంత మాత్రాన మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారని కాదు. రేపు మీ ఉద్యోగం పోతే, నెలవారీ వాయిదాలు (EMI), ఇతర ఇంటి ఖర్చులు చెల్లించడం ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే ఇలాంటి సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. జీతం పెంపును ఇతర ఖర్చులకు వాడే ముందు, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు ఉపయోగించండి. ఆరు నుంచి పన్నెండు నెలల జీవన ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టడం మంచిది.

55
మీ అర్హత ఉన్నా అనవసర లోన్లు వద్దు..

మీ ఆదాయం పెరిగినప్పుడు పెద్ద హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్‌కు అర్హత పొందొచ్చు... అంతమాత్రాన ఎక్కువ అప్పు చేయాలని కాదు. బ్యాంకు ఎక్కువ అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, దాన్ని సులభంగా తిరిగి చెల్లించవచ్చని అనుకోవడం పొరపాటు. పెద్ద EMIలు మీ పొదుపు, పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. అప్పు చేసి వస్తువులు కొనడానికి, లైఫ్‌స్టైల్ మార్చుకోవడానికి ముందు ఆ వస్తువు మీకు నిజంగా అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఆదాయం పెరిగినప్పుడు ఆర్థిక బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు ఇటీవల పెళ్లి చేసుకున్నా, ఇల్లు కొన్నా, లేదా పిల్లలు పుట్టినా.. మీ ప్రస్తుత లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోకపోవచ్చు. అలాగే ఐదేళ్ల క్రితం మీ జీతానికి సరిపోయిన పెట్టుబడులు, మీ ప్రస్తుత లక్ష్యాలకు సరిపోకపోవచ్చు. జీతం పెంపు అనేది మీ నెలవారీ బడ్జెట్‌ను మాత్రమే కాదు, మీ మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సమీక్షించుకోవాలని గుర్తు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories