Most Expensive Pen: ఒక్క పెన్ కొనే డబ్బుతో... ఏకంగా పది విల్లాలు కొనుగోలు చేయచ్చు. అంతేకాదు, లైఫ్ మొత్తం ఏ పని చేయకుండానే కాలి మీద కాలు వేసుకొని కూర్చొని బతికేయచ్చు. అసలు ఆ పెన్ లో ఏముంది?
సాధారణంగా మనం వాడే పెన్నులు పది రూపాయల నుంచి వంద రూపాలలలోపే ఉంటాయి. కొంచెం ఖరీదైన బ్రాండెడ్ పెన్నులు అయితే వేలల్లో, మరీ లగ్జరీ అయితే లక్షల్లో ఉంటాయి. కానీ, కేవలం ఒక్క పెన్ ధర ఏకంగా రూ.67 కోట్లు అంటే నమ్ముతారా? మీరు చదివింది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ గా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది.. ‘ ఫుల్గోర్ నాక్టర్నస్ బై టిబాల్డి’ (Fulgor Nocturnus by Tibaldi). అసలు ఈ పెన్ను అంత ధర ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం....
ప్రపంచం మొత్తంలో ఇది ఒక్కటే ఉంది...
ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ పెన్నుల తయారీ సంస్థ టిబాల్డి. ఈ అద్భుతమైన ఫౌంటెన్ పెన్ ని రూపొందించింది. దీనిని సాధారణ అమ్మకాల కోసం కాకుండా,ప్రపంంలోనే అత్యంత ప్రత్యేకమైన వన్ ఆఫ్ ఎ కైండ్ కళాఖండంగా తయారు చేశారు. అంటే... ప్రపంచంలో ఇలాంటి పెన్ మరొకటి ఉండదు. ఇది ఒక్కటి మాత్రమే ఉంది.
22
ఈ పెన్ ఇంత ఖరీదు ఎందుకు..?
ఈ పెన్ మీద వజ్రాలు పొదిగి మరీ తయారు చేస్తారు. అయితే, కేవలం వజ్రాలు ఉండటం వల్లే ఈ పెన్ ఇంత ఖరీదు అవ్వలేదు. దీని వెనక ఒక కారణం కూడా ఉంది. దీని వెనక అద్బుతమైన ఇంజనీరింగ్ , గణిత సూత్రం కూడా ఒక కారణం. లియోనార్డో డా విన్సీ వంటి మహానుభావులు తమ చిత్రాల్లో ఉపయోగించిన 'డివైన్ ప్రొపోర్షన్' (Phi - 1.618) అనే గణిత నిష్పత్తి ఆధారంగా దీనిని తయారు చేశారు. అంటే పెన్ను మూత పొడవుకు, పెన్ను మిగితా భాగం పొడవుకు మధ్య ఉండే నిష్పత్తికి కచ్చితంగా 1.618 ఉండేలా డిజైన్ చేశారు. అందుకే.. ఈ పెన్ కి అంత విలువ. ఈ పెన్ను పై అత్యంత అరుదైన 945 నల్ల వజ్రాలను ఎంతో నైపుణ్యంతో పొదిగారు. 'ఫుల్గోర్ నాక్టర్నస్' అంటే లాటిన్ భాషలో 'రాత్రిపూట మెరుపు' (Night Glow) అని అర్థం. ఈ పెన్ను రాత్రి పూట కూడా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ పెన్ను మీద 945 వజ్రాలతో పాటు 123 కెంపులు కూడా అమర్చారు. అంతేకాదు, ఈ పెన్నులో 18 క్యారెట్ల బంగారంతో కూడా తయారు చేశారు. దీనిపై రుథీనియం పూత కూడా పూస్తారు. దీని వల్ల పెన్ చాలా మృదువుగా ఉంటుంది.
రూ.67కోట్లకు అమ్ముడుపోయిన పెన్ను...
2010లో చైనాలోని షాంఘైలో జరిగిన ఒక ప్రత్యేక ఛారిటీ వేలంలో (Charity Auction) ఈ పెన్నును ప్రదర్శించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పోటీ పడిన ఈ వేలంలో, ఒక వ్యక్తి.. దీనిని ఏకంగా $8 మిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు ₹67 కోట్లు) సొంతం చేసుకున్నారు.