Motivational story: మన లాభం కోసం ఇతరులను మోసం చేయడం సర్వసాధారణం. అయితే మనల్ని నమ్ముతున్న వారిని పదే పదే మోసం చేస్తే జీవితంలో భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఈ సత్యాన్ని చాటిచెప్పే ఒక కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.
అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఉప్పు వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పైనే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఉప్పు బస్తాలను వేసి తీసుకెళ్లేవాడు. రోజూ కష్టపడి పని చేస్తూ ఇద్దరూ జీవనం సాగించేవారు.
25
గాడిదపై పెరిగిన నమ్మకం
కొన్ని రోజుల తర్వాత రాజుకు గాడిదపై పూర్తి నమ్మకం వచ్చింది. ఒక రోజు నుంచి గాడిదనే ఒంటరిగా ఉప్పు బస్తాలతో పంపించడం ప్రారంభించాడు. గాడిద కూడా పని చేసి తిరిగి వచ్చేది. రాజు దానికి తిండి పెట్టి బాగా చూసుకునేవాడు. ఇలా రెండు మూడు రోజులు సాఫీగా సాగింది.
35
గాడిద చేసిన కన్నింగ్ ప్లాన్
ఒక రోజు గాడిద ఒక ప్లాన్ వేసింది. ఉప్పు బస్తా మోసుకుని నది దాటే సమయంలో నీటిలో మునిగింది. నీటిలో మునిగిన వెంటనే ఉప్పు కరిగిపోయింది. బస్తా ఖాళీగా మారింది. తిరిగి యజమాని దగ్గరకు వచ్చి, “వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో ఉప్పు కరిగిపోయింది” అని చెప్పింది. రాజు నమ్మి పట్టించుకోలేదు.
ఇలా ఒక్కసారి కాదు, మరోసారి కూడా అదే పద్ధతి కొనసాగించింది. “వర్షం పడింది కాబట్టి ఉప్పు కరిగిపోయింది” అని మళ్లీ అబద్ధం చెప్పింది. పని చేయకుండా తప్పించుకోవడం గాడిదకు అలవాటైపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ గాడిద మోసం పెరుగుతూనే ఉంది. కానీ రాజుకు మాత్రం అనుమానం మొదలైంది.
55
యజమాని ప్లాన్… గాడిదకు బుద్ధి
ఒక రోజు రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఉప్పుకు బదులుగా బస్తాలో పత్తి నింపి గాడిదపై వేసి పంపించాడు. గాడిద మళ్లీ తన పాత ప్లాన్ ప్రకారం నదిలోకి దిగింది. నీటిలో మునిగింది. కానీ ఈసారి పత్తి తడిసిన వెంటనే బరువు పెరిగింది. గాడిదకు నడవడం కష్టమైంది. అప్పుడే తన తప్పు అర్థమైంది. కష్టంగా యజమాని దగ్గరకు వచ్చి చేసిన తప్పుకు క్షమించమని అడిగింది.
సందేశం: మోసం ఎప్పటికీ దాగదు. ఒక రోజు నిజం బయటపడుతుంది. నిజాయితీగా పని చేయడం మాత్రమే మనల్ని కాపాడుతుందనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.