మెహెందీకి ఈజిప్ట్ మమ్మీలతో సంబంధం ఏంటి? భారత్‌లో పెళ్లిళ్లలో మెహెందీ సంప్రదాయం ఎలా మొదలైంది?

Published : Jul 03, 2026, 07:15 PM IST

Mehndi: భారతీయ సంప్రదాయంలో మెహెందీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అంటే మెహెందీ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. అయితే నేడు అందానికి ప్రతీకగా భావించే మెహెందీకి.. ఈజీప్ట్ మ‌మ్మీల‌తో సంబంధం ఉంద‌ని మీకు తెలుసా.? 

PREV
14
అందం కోసం కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసమే మొదటి వినియోగం

ప్రాచీన కాలంలో మెహెందీని అందం కోసం కాకుండా ఔషధ మొక్కగా ఉపయోగించేవారు. శరీరానికి చల్లదనం అందించేందుకు, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు దీన్ని చేతులు, కాళ్లకు రాసుకునేవారు. అంతేకాదు, గాయాలు త్వరగా మానేందుకు, తలనొప్పిని తగ్గించేందుకు, జుట్టు బలంగా పెరగడానికి కూడా మెహెందీని సహజ ఔషధంగా వినియోగించేవారు. అందుకే దీనికి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

24
ఈజిప్ట్ మమ్మీలతో మెహెందీకి ఉన్న సంబంధం

మెహెందీ పుట్టుకపై చరిత్రలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం క్రీ.పూ. 1894 నుంచి 539 మధ్య బాబిలోనియా నాగరికతలో మెహెందీ వాడకం ఉండేదని చెబుతారు. మరోవైపు, ప్రాచీన ఈజిప్ట్‌లో రాజులు, రాణుల మృతదేహాలను మమ్మీలుగా భద్రపరిచే సమయంలో మెహెందీని ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. మృతదేహం త్వరగా కుళ్లిపోకుండా ఉంచడంలో ఇది సహాయపడుతుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. అలాగే మరణించిన వారి ఆత్మను చెడు శక్తుల నుంచి కాపాడే పవిత్ర శక్తి మెహెందీకి ఉందని విశ్వసించేవారు.

34
భారత్‌లో వేదకాలం నుంచే మెహెందీకి ప్రత్యేక స్థానం

భారత్‌లో మెహెందీ వినియోగానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వేదకాలానికి చెందిన పలు గ్రంథాల్లో మెహెందీ ప్రస్తావన కనిపిస్తుంది. యజ్ఞాలు, పూజలు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో మెహెందీని ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. భారతీయ సనాతన సంప్రదాయంలో మెహెందీని పవిత్రత, శుభం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించారు. కాలక్రమేణా మహిళలు శుభ సందర్భాల్లో చేతులకు, కాళ్లకు మెహెందీ వేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.

44
మొఘల్ కాలంలో కళాత్మక రూపం దాల్చిన మెహెందీ

భారత్‌లో మెహెందీ ఇప్పటికే ఉన్నప్పటికీ, దానికి అందమైన డిజైన్లు, కళాత్మక రూపాన్ని తీసుకువచ్చింది మొఘల్ కాలమే అని చరిత్ర చెబుతోంది. 1526 నుంచి 1857 వరకు మొఘల్ పాలనలో మెహెందీ అలంకరణకు విశేష ఆదరణ లభించింది. ఆ కాలంలో రాజ కుటుంబాల మహిళలు చేతులు, కాళ్లపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెహెందీ వేయించుకునేవారు. తర్వాత ఈ సంప్రదాయం ప్రజల్లోకి విస్తరించింది. చేతుల నుంచి మోచేతుల వరకు, కాళ్లపై కూడా అందమైన డిజైన్లతో మెహెందీ వేయించడం భారతీయ వివాహాల్లో ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories