ఐటీ ఉద్యోగాలు వదిలి.. ప్రశాంతమైన జీవితం కోసం
ఈ గ్రామం యొక్క గొప్పతనం ఏమిటంటే, అత్యంత ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం ఐటీ (IT) ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకే నిద్రలేచి శ్రీకృష్ణుడికి హారతి ఇస్తారు. రోజులో కేవలం రెండు సార్లు మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఘన పదార్థాలు తీసుకోకుండా కేవలం పాలు మాత్రమే సేవిస్తారు.
ఇక్కడ పిల్లలు మోడర్న్ పాఠశాలలకు వెళ్లకుండా గురుకులాల్లో చదువుకుంటారు. వారికి వేదాలు, భగవద్గీత, సంస్కృతం వంటి విషయాలను నేర్పిస్తారు. పిల్లలపై డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనే ఎలాంటి ఒత్తిడి ఉండదు, వారి ఆసక్తికి తగినట్లుగా నేర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది.
ముఖ్యంగా ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్ గానీ, కోర్టు గానీ లేదు. మనం ఒక్క నిమిషం కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్న ఈ రోజుల్లో, టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉంటూ.. ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న ఈ గ్రామం మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.