Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?

Published : Sep 06, 2026, 08:27 PM IST

అవసరాల కోసం ఇంట్లో కొంత డబ్బు పెట్టుకోవడం చాలా కుటుంబాలకు అలవాటు. అయితే ఇలా ఇంట్లో ఒక పరిమితి దాటి డబ్బులుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ సమస్యలు వస్తాయని అంటారు… ఇందులో నిజమెంత?

PREV
15
ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు?

ఈ రోజుల్లో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డుల వాడకం పెరిగినా అత్యవసరాల కోసం ఇంట్లో కొంత క్యాష్ పెట్టుకోవడం సాధారణమే. ఏటీఎంలు అందుబాటులో లేని చోట లేదా ఇంటర్నెట్ పనిచేయని పరిస్థితుల్లో చేతిలో డబ్బు ఉండటం ఉపయోగపడుతుంది.

అయితే ఇటీవల కాలంలో ఇంట్లో ఎక్కువ డబ్బులుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగవచ్చని… ఆ డబ్బులన్నీ అధికారులు తీసుకెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇంట్లో డబ్బు దాచుకోవడానికి ప్రత్యేకంగా 'చట్టపరమైన గరిష్ఠ పరిమితి' ఏదైనా ఉందా అన్న డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. దీనికి ఆర్థిక నిపుణులు ఆసక్తికర సమాధానం ఇస్తున్నారు.

25
డబ్బుకు లెక్కలుంటే నో ప్రాబ్లమ్
మీరు ఇంట్లో ఎంత డబ్బు పెట్టారన్న దానికంటే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం ముఖ్యం. బ్యాంకు నుంచి తీసిన డబ్బుకు స్టేట్‌మెంట్లు, వ్యాపార ఆదాయానికి లెక్కలు, వ్యవసాయ ఆదాయానికి సంబంధించిన పత్రాలు వంటివి ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. లెక్కల్లో చూపని డబ్బుకు ఆధారం లేకపోతేనే చిక్కులు వస్తాయి.
35
ఇంట్లో డబ్బు ఉంచుకోవడం నేరం కాదు

ఇంట్లో రూ.10 లక్షలు ఉంటే అరెస్ట్ చేస్తారని, రూ.5 లక్షలు దాటితే ఐటీ అధికారులు సీజ్ చేస్తారని వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మొద్దు. డబ్బు ఇంట్లో ఉంచుకోవడానికి ఒకే ఒక్క పరిమితి అంటూ ఏదీ లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు, దొరికిన డబ్బుకు సరైన ఆధారం చూపించడం చాలా ముఖ్యం.

45
ఎమర్జెన్సీ ఫండ్‌ను పూర్తిగా ఇంట్లో ఉంచవద్దు
ఉద్యోగం పోవడం, అనుకోని వైద్య ఖర్చులు వంటి పరిస్థితుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం మంచి ఆర్థిక అలవాటని సెబీ (SEBI) చెబుతోంది. కానీ ఆ మొత్తం డబ్బును ఇంట్లో నగదు రూపంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లాంటి వాటిలో ఉంచుకుంటే సులభంగా వాడుకోవచ్చు.
55
ఎంత డబ్బు ఇంట్లో ఉంచుకోవడం సరైనది?

ఇంతే మొత్తమని కచ్చితంగా చెప్పలేం. ఇది ప్రతి కుటుంబం రోజువారీ ఖర్చులు, వైద్య అవసరాలు, ఏటీఎం సౌకర్యాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తాన్ని ఇంట్లో ఎక్కువ కాలం ఉంచడం వల్ల దొంగతనం, అగ్నిప్రమాదం, ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గడం వంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి అవసరానికి సరిపడా ఉంచుకుని, మిగతాది సురక్షితమైన మార్గాల్లో దాచుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories